ముంబై:  ప్రియుడితో శృంగారంలో మునిగితేలాలని భావించిన ఓ మహిళ వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. తాను వేసిన ప్లాన్ తోనే ప్రియుడు ప్రాణాలు కోల్పోవల్సి వచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకొంది.

శృంగారంలో ఈ జంట చేసిన ప్రయోగం యువకుడి ప్రాణాలను తీసింది. నాగపూర్ కు  చెందిన 30 ఏళ్ల యువకుడికి  సమీప గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది.  గురువారం నాడు రాత్రి  వీరిద్దరూ ఖాపర్‌ఖేడ గ్రామ లాడ్జిలో దిగారు.

శృంగార సమయంలో కుర్చీకి ఆ యువకుడి కాళ్లు, చేతులను ఆమె నైలాన్ తాడుతో కట్టింది. మెడ చుట్టూ కూడ మరో తాడు కూడా బిగించింది. ఇలా చేయడంతో శృంగార సమయంలో వీరిద్దరూ మరింత తృప్తిని పొందుతారని భావించారని పోలీసులు చెప్పారు.

కుర్చీలో యువకుడు ఉన్న సమయంలో ఆమె బాత్‌రూమ్ లోకి వెళ్లింది. అయితే అదే సమయంలో కుర్చీ కిందపడి యువకుడి మెడకు కట్టిన తాడు బిగుసుకుపోయింది. బాత్ రూమ్ నుండి మహిళ వచ్చేసరికి  ఆ యువకుడు మరణించాడు. 

ఈ విషయం తెలుసుకొన్న పోలీసులు  సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు  మహిళను అరెస్ట్ చేశారు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. 

తమ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని పోలీసుల విచారణలో ఆ మహిళ ఒప్పుకొందని  తెలిపారు.  ఇద్దరి సెల్‌ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు.