ఎంత ఆకలిగా ఉన్నా ఎవరైనా సరే నిమిషంలో ఒక ఇడ్లీ తినగలుగుతారు. కొంచెం భోజన ప్రియులైతే రెండు ఇడ్లీలు తింటారు. అలాంటి ఏకంగా నిమిషంలో అరడజను ఇడ్లీలు తింటే.. వినడానికి కాస్త విడ్డూరంగా అనిపించినా ఇది నిజం.

దసరా ఉత్సవాలంటే మైసూర్‌ కేరాఫ్ ఆడ్రస్ ప్రతి ఏడు లాగానే ఈ ఏడాది కూడా వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం నగరంలోని ఓ ఆలయంలో మహిళలకు ఇడ్లీలు తినే పోటీలను నిర్వహించారు.

ఈ పోటీల్లో హుల్లాహల్లి ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల సరోజమ్మ కేవలం ఒకే ఒక్క నిమిషంలో ఆరు ఇడ్లీలు హాంఫట్ చేసి విజేతగా నిలిచారు. బామ్మ గారి స్పీడు చూసిన జనం ఔరా అని ముక్కున వేలేసుకున్నారు.