Asianet News TeluguAsianet News Telugu

ఏడు రోజులు ఉపవాస దీక్ష... యువతి మృతి

వారం రోజుల పాటు సాగే ఉపవాసదీక్షను ఆమె చేపట్టారు. ఐదు రోజుల తర్వాత ఆమె అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. ఆమెను పరీక్షించిన డాక్టర్‌ దీక్షను విరమించి రోజుకు ఒకసారైనా ఆహారం తీసుకోవాలని సూచించగా ఏక్తా నిరాకరించారు. 
 

Mumbai: Jain woman on fast dies of heart attack
Author
Hyderabad, First Published Sep 6, 2019, 9:40 AM IST

భక్తితో దేవుడికి పూజించి... మంచి జరగాలని ప్రార్థిస్తూ.. ఓ యువతి ఏడు రోజులపాటు ఉపవాస దీక్ష చేసింది. కానీ ఆ  ఉపవాస దీక్షే ఆమె ప్రాణాలు తీసింది. జైన సంప్రదాయం ప్రకారం ఏడు రోజుల పాటు ఉపవాస దీక్ష చేసిన పాతికేళ్ల జైన్‌ మహిళ ఏక్తా అశుభాయ్‌ గల హఠాన్మరణానికి గురయ్యారు. ఏక్తా ఉపవాసదీక్ష కోసం గుజరాత్‌లోని కచ్‌లో నెల కిందట పుట్టింటికి చేరుకున్నారు. 

ఆగస్ట్‌ 27న వారం రోజుల పాటు సాగే ఉపవాసదీక్షను ఆమె చేపట్టారు. ఐదు రోజుల తర్వాత ఆమె అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. ఆమెను పరీక్షించిన డాక్టర్‌ దీక్షను విరమించి రోజుకు ఒకసారైనా ఆహారం తీసుకోవాలని సూచించగా ఏక్తా నిరాకరించారు. 

సెప్టెంబర్‌ 3న ఏక్తా ఆరోగ్యం క్షీణించగా ఆమెకు గ్లూకోజ్‌ ఎక్కించారు. అప్పటికీ జైన విశ్వాసాల ప్రకారం ఆమె కేవలం బాయిల్డ్‌ వాటర్‌ను మాత్రమే సేవించేందుకు అంగీకరించారు. అదే రోజు రాత్రి ఆమె గుండెపోటుతో హఠాన్మరణానికి గురయ్యారని ఏక్తా బంధువులు వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios