ఓ ఆటో డ్రైవర్ మహిళ ముందు నీచపు పని చేశాడు. తన ప్యాంట్ జిప్ తీసి... మహిళ ఎదురుగా నిలబడి.. స్వయంతృప్తి లో పాల్గొన్నాడు. కాగా.... అతను చేసిన పనికి తొలుత షాకైన మహిళ.. తర్వాత తేరుకొని పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ ఆటో డ్రైవర్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన దేశ ఆర్ధిక రాజధాని ముంబయిలో చోటుచేసుకోగా... ఆ ఆటో డ్రైవర్ వయసు 55 ఏళ్లు కావడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే.... రామ్ నరేష్ యాదవ్ (55) అనే వ్యక్తి ముంబయి నగరంలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల బస్టాప్ లో నిలబడి ఉన్న ఓ మహిళ ఎదురుగా నిలబడి స్వయంతృప్తిలో పాల్గొన్నాడు. అది చూసిన మహిళ వెంటనే అతని ఫోటోని తన ఫోన్ లో బంధించింది. అనంతరం ఆ ఫోటోని ట్విట్టర్ లో పోస్టు చేసి తనకు ఎదురైన సందర్భాన్ని అక్కడ వివరించింది. ఆ ట్వీట్ కి ముంబయి పోలీసులను ట్యాగ్ చేసింది. 

దీంతో... విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె ఫిర్యాదు ఆధారంగా తాజాగా ఆ ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకోవడం గమనార్హం. సదరు ఆటో డ్రైవర్ వరసగా రెండు రోజుల మహిళ ముందు అదేవిధంగా ప్రవర్తించడం గమనార్హం. దీంతో... ఆమె డ్రైవర్ ఫోటోతోపాటు... ఆమె ఆటో నెంబర్ ప్లేట్ ని కూడా ఫోటో తీసి పోలీసులకు అందజేసింది. దీంతో నిందితుడిని పట్టుకోవడం పోలీసులకు సులభమయ్యింది.