రాజస్థాన్ లో ఓ మహిళ ఎనిమిది మంది సంతానాన్ని, భర్తను వదిలేసి ప్రియుడితో పారిపోయింది. తనకు భర్త, పిల్లలు వద్దంటూ మారానికి దిగింది.
రాజస్థాన్ : సంసారంలో విసిగిపోయిందో... ఒకరి వెనుక ఒకరుగా పుట్టుకొచ్చిన పిల్లల సేవలతో అలిసిపోయిందో.. కానీ... ఓ తల్లితీవ్రమైన నిర్ణయం తీసుకుంది. ఎనిమిదిమంది పిల్లల్నివదిలేసి... ప్రియుడితో లేచిపోయింది. అది కూడా తనకంటే వయసులో చాలా పెద్ద అయిన అతడితో...rajasthan లోని భరత్ పుర్ సమీప నీమల గ్రామంలో ఎనిమిది మంది పిల్లల తల్లి.. ఆ సంసారం తనకిక వద్దనుకుని 57యేళ్ల ప్రియుడితో వెళ్లిపోయింది. తన భార్యను ‘ ఫలానా’ వ్యక్తి కిడ్నాప్ చేశారంటూ ఆమె భర్త కైత్వారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ వ్యక్తి వీరి ఇంటికి సమీపంలోనే ఉండేవాడు.
ఆమె తరచు అతడు ఇంటికి వెళ్తూ, వస్తూ ఉండేది. అలా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గత ఆరేళ్ళుగా ఈ వ్యవహారం నడుస్తుంది. తన భార్యకు తాయత్తు ఇచ్చిలోబరుకున్నాడన్నది భర్త ఆరోపణ… కేసు నమోదు చేసిన పోలీసులు ఆ మహిళను తీసుకువచ్చి శనివారం కోర్టులో హాజరు పరిచారు. తాను స్వచ్ఛందంగా వెళ్లానని.. ఎవరో కిడ్నాప్ చేయలేదని ఆమె కరాఖండిగా చెప్పింది. భర్త, పిల్లల వద్దకు తిరిగి వెళ్లేందుకు ససేమీరా అన్నది.
ఇదిలా ఉండగా, నిరుడు హైదరాబాద్ లో ‘బంగ్లా అన్నావు.. ఇదేం ఇల్లు..’ అని అత్తగారింటికి వచ్చిన newly wedded bride భర్తపై రుసరుసలాడి అక్కడి నుంచి పరారయ్యింది. ఈ సంఘటన యాచారం మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామానికి చెందిన ఓ 40 యేళ్ల వ్యక్తి తనకు Marital relationship చూడాలని సమీప బంధువైన మంచాల మండలం లింగంపల్లికి చెందిన ఓ మధ్యవర్తిని కోరాడు.
అతను విజయవాడలో తనకు తెలిసిన వ్యక్తి ద్వారా పెళ్లి సంబంధం చూశాడు. విజయవాడకు చెందిన ఓ మహిళతో పెళ్లి కుదిర్చాడు. ఈ నెల 17న కుర్మిద్దకు చెందిన సదరు వ్యక్తితో సహ కుటుంబ సభ్యులు విజయవాడకు వెళ్లారు. అదేరోజు ఉదయం 11.40 గంలకు ఓ లాడ్జిలో వివాహం జరిగింది. అనంతరం నూతన దంపతులు, ఇరువురి కుటుంబ సభ్యులు విజయవాడ నుంచి నేరుగా యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామిని దర్శంచుకున్నారు.
రాత్రి అక్కడే బస చేశారు. శనివారం తెల్లవారుజామున మధ్యవర్తి గ్రామమైన మంచాల మండలం లింగంపల్లికి వచ్చారు. అదే రాత్రి 9గంటలకు కుర్మిద్దకు చేరుకున్నారు. వచ్చీ రాగానే.. ‘పాత ఇల్లు చూసి.. బంగ్లా అన్నావ్.. ఇదేం ఇల్లు’ అని రుసరుసలాడింది. తనకు కడుపునొప్పి వస్తోంది టాబ్లెట్స్ తేవాలంటూ భర్తను బయటికి పంపించింది.
వధువుతో పాటు వచ్చిన మరో మహిళ ఇంటి బయటనే ఉండి అప్పటికే వేసిన పథకం ప్రకారం కారును తెప్పించుకుని క్షణాల్లోనే వెళ్లిపోయారు. కాగా, ఆ మహిళల నుంచి తాను మోసపోయానని మంగళవారం కుర్మిద్ద గ్రామానికి చెందిన వరుడు యాచారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే విషయం మీద సీఐ లింగయ్యను సంప్రదించగా.. తాను కోటీశ్వరుడినని, నగరంలో పెద్ద బంగ్లా ఉందని, తన పేరు మీద కుర్మిద్దలో పదెకరాల వ్యవసాయ పొలం ఉందని ఆ వ్యక్తి చెప్పి మాటలకు తామే మోసపోయానని వధువు చెప్పినట్లు సీఐ తెలిపారు.
