బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. నాలుగేళ్ల కూతురిని బాల్కనీలోంచి విసిరేసి అనంతరం తానూ ఆత్మహత్యాయత్నం చేసింది.
బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. నాలుగేళ్ల కూతురిని బాల్కనీలోంచి విసిరేసింది తల్లి. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఈలోపే ఈ దారుణాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను అడ్డుకున్నారు. అయితే చిన్నారి ఘటనాస్థలిలోనే మరణించినట్లుగా తెలుస్తోంది. పాపకు మాటలు రావు, చెవులు వినిపించవనే బాధతో తల్లి గతకొంతకాలంగా డిప్రెషన్‌లో వున్నట్లుగా తెలుస్తోంది. ఆమె భర్త డెంటిస్ట్‌గా పనిచేస్తున్నాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
