నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Monday 12th semtember telugu news live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

9:22 PM IST

అమ్మవారికి ముంబై భక్తుడి కానుక

విజయవాడలో కొలువైయున్న కనకదుర్గమ్మ అమ్మవారిపై భక్తిని చాటుకున్నారు నవీ ముంబై రెకాన్ మెరైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన జి కృష్ణారెడ్డి. అమ్మవారికి 1308 గ్రాముల బరువు కలిగిన స్వర్ణ కిరిటాలను కానుకగా అందజేశారు. 
 
8:42 PM IST

తెలంగాణలో అటవీ విశ్వవిద్యాలయం

తెలంగాణలో అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మారుస్తూ.. తెలంగాణ అటవీ శాస్త్ర విశ్వవిద్యాలయం చట్ట 2022కు సంబంధించిన బిల్లును కేసీఆర్ సర్కార్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 

7:42 PM IST

తెలంగాణలో మరో 833 పోస్టులకు నోటిఫికేషన్

రాష్ట్రంలో 833 ఇంజనీరింగ్ పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని కమీషన్ తెలిపింది. ఇందులో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు వున్నాయి. 
 
7:00 PM IST

అక్టోబర్ 24న తెలంగాణలోకి రాహుల్ పాదయాత్ర

అక్టోబర్ 24న రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. 15 రోజుల పాటు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటిస్తారని.. పాదయాత్రలో భాగంగా 3 భారీ బహిరంగ సభలు నిర్వహిస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్, శంషాబాద్, జోగిపేటలో బహిరంగ సభలు నిర్వహిస్తారని ఆయన చెప్పారు. 

6:11 PM IST

కల్వకుంట్ల కవితకు కరోనా

టీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా బారినపడ్డారు. గత మూడు రోజులుగా కోవిడ్ అనుమానిత లక్షణాలతో ఆమె బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం వైద్య పరీక్షలు చేయించగా.. ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె వెంటనే ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు కోవిడ్ టెస్టులు చేయించుకోవాల్సిందిగా కవిత సూచించారు. 

3:37 PM IST

జ్ఞానవాపి వివాదంపై వారణాసి కోర్టు సంచలన నిర్ణయం

జ్ఞానవాపి వ్యవహారంలో వారణాసి కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అంజుమన్ ఇంతజామియా కమిటీ పిటిషన్ కొట్టేసి హిందూసంఘాల పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ ను సెప్టెంబర్ 22న మరోసారి విచారించనున్నట్లు వారణాసి కోర్టు తెలిపింది. 

2:32 PM IST

జూబ్లీహిల్స్ నివాసంనుండి ప్రారంభమైన కృష్ణంరాజు అంతిమయాత్ర

అనారోగ్యంతో మృతిచెందిన ప్రముఖ తెలుగు సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభమయ్యింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసం నుండి  కుటుంబసభ్యులు, భారీ అభిమానులు కృష్ణంరాజు అంతిమయాత్రలో  పాల్గొన్నారు. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ కనకమామిడి వద్దగల ఫాంహౌస్ లో కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి.
 
12:48 PM IST

కేరళలో ఘోర రోడ్డుప్రమాదం... ఒకరు మృతి, 58 మందికి గాయాలు

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న రాష్ట్ర ఆర్టిసి బస్సు నేరిమంగళం వద్ద లోయలో పడింది. దీంతో ఒకరు మృతిచెందగా 58 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. 

11:33 AM IST

మోదీ మోర్ ఫాసిస్ట్ ప్రధాని..: తెలంగాణ అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ధ్వజం

తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ మోర్ ఫాసిస్ట్ ప్రధాని అని ఆనాడే చెప్పానని అన్నారు. కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోందని... సీలేరు పవర్ ప్లాంట్, ఏడు మండలాలను లాక్కున్నారని గుర్తుచేసారు. కేంద్ర విద్యుత్ బిల్లుపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసారు. 

10:53 AM IST

భారత్ లో 50వేల దిగువకు కరోనా యాక్టివ్ కేసులు

భారత్ కరోనా మహమ్మారి నుండి పూర్తిగా బయటపడుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 5,221 కొత్తకేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే కొత్తకేసుల కంటే రికవరీలో ఎక్కువగా వుండటంతో యాక్టివ్ కేసులు సంఖ్య 47,176 కు చేరుకుంది. 

10:15 AM IST

గుడ్ మండే... ఆరంభంలోనే లాభాల్లో దూసుకెళుతున్న స్టాక్ మార్కెట్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 400 పాయింట్ల లాభాలతో, నిప్టి 120 పాయింట్ల లాభాలతో కొనసాగుతున్నాయి. 

9:46 AM IST

హైదరాబాద్ లో పట్టుపడ్డ అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా

హైదరాబాద్ పోలీసులు భారీ గంజాయి స్మగింగ్ ముఠాను పట్టుకున్నారు. వైజాగ్ నుండి మహారాష్ట్రకు హైదరాబాద్ మీదుగా గంజాయిని తరలిస్తున్న పక్కా సమాచారం అందడంతో మల్కాజిగిరి ఎస్వోటి టీమ్ చౌటుప్పల్ పోలీసులు రంగంలోకి దిగి 360 కిలోల గంజాయిని తరలిస్తున్న ఆరుగురిని పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటి విలువ రూ.1.2 కోట్లుగా వుంటుందని అంచనా వేస్తున్నారు. 

9:36 AM IST

యూఎస్ ఓపెన్ లో 19ఏళ్ల యువకెరటం విజయం

యూఎస్ ఓపెన్ లో పెను సంచలనం నమోదయ్యింది. 19ఏళ్ల స్పానిష్ టెన్నిస్ స్టార్ కార్లస్ అల్కరాజ్ అద్భుత ప్రదర్శనతో ట్రోపీని ఎగరేసుకుపోయాడు.  నార్వేకు చెందిన కాస్పెర్ రూడ్ తో జరిగిన హోరాహోరీగా ఫైనల్లో చివరకు అల్కరాజ్ నే విజయం వరించింది. 

9:22 PM IST:

విజయవాడలో కొలువైయున్న కనకదుర్గమ్మ అమ్మవారిపై భక్తిని చాటుకున్నారు నవీ ముంబై రెకాన్ మెరైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన జి కృష్ణారెడ్డి. అమ్మవారికి 1308 గ్రాముల బరువు కలిగిన స్వర్ణ కిరిటాలను కానుకగా అందజేశారు. 
 
8:42 PM IST:

తెలంగాణలో అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మారుస్తూ.. తెలంగాణ అటవీ శాస్త్ర విశ్వవిద్యాలయం చట్ట 2022కు సంబంధించిన బిల్లును కేసీఆర్ సర్కార్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 

7:42 PM IST:

రాష్ట్రంలో 833 ఇంజనీరింగ్ పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని కమీషన్ తెలిపింది. ఇందులో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు వున్నాయి. 
 
7:00 PM IST:

అక్టోబర్ 24న రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. 15 రోజుల పాటు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటిస్తారని.. పాదయాత్రలో భాగంగా 3 భారీ బహిరంగ సభలు నిర్వహిస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్, శంషాబాద్, జోగిపేటలో బహిరంగ సభలు నిర్వహిస్తారని ఆయన చెప్పారు. 

6:11 PM IST:

టీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరోనా బారినపడ్డారు. గత మూడు రోజులుగా కోవిడ్ అనుమానిత లక్షణాలతో ఆమె బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం వైద్య పరీక్షలు చేయించగా.. ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆమె వెంటనే ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు కోవిడ్ టెస్టులు చేయించుకోవాల్సిందిగా కవిత సూచించారు. 

3:37 PM IST:

జ్ఞానవాపి వ్యవహారంలో వారణాసి కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అంజుమన్ ఇంతజామియా కమిటీ పిటిషన్ కొట్టేసి హిందూసంఘాల పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ ను సెప్టెంబర్ 22న మరోసారి విచారించనున్నట్లు వారణాసి కోర్టు తెలిపింది. 

2:32 PM IST:

అనారోగ్యంతో మృతిచెందిన ప్రముఖ తెలుగు సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభమయ్యింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసం నుండి  కుటుంబసభ్యులు, భారీ అభిమానులు కృష్ణంరాజు అంతిమయాత్రలో  పాల్గొన్నారు. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ కనకమామిడి వద్దగల ఫాంహౌస్ లో కృష్ణంరాజు అంత్యక్రియలు జరగనున్నాయి.
 
12:48 PM IST:

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న రాష్ట్ర ఆర్టిసి బస్సు నేరిమంగళం వద్ద లోయలో పడింది. దీంతో ఒకరు మృతిచెందగా 58 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. 

11:33 AM IST:

తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ మోర్ ఫాసిస్ట్ ప్రధాని అని ఆనాడే చెప్పానని అన్నారు. కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోందని... సీలేరు పవర్ ప్లాంట్, ఏడు మండలాలను లాక్కున్నారని గుర్తుచేసారు. కేంద్ర విద్యుత్ బిల్లుపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసారు. 

10:53 AM IST:

భారత్ కరోనా మహమ్మారి నుండి పూర్తిగా బయటపడుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 5,221 కొత్తకేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే కొత్తకేసుల కంటే రికవరీలో ఎక్కువగా వుండటంతో యాక్టివ్ కేసులు సంఖ్య 47,176 కు చేరుకుంది. 

10:15 AM IST:

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 400 పాయింట్ల లాభాలతో, నిప్టి 120 పాయింట్ల లాభాలతో కొనసాగుతున్నాయి. 

9:46 AM IST:

హైదరాబాద్ పోలీసులు భారీ గంజాయి స్మగింగ్ ముఠాను పట్టుకున్నారు. వైజాగ్ నుండి మహారాష్ట్రకు హైదరాబాద్ మీదుగా గంజాయిని తరలిస్తున్న పక్కా సమాచారం అందడంతో మల్కాజిగిరి ఎస్వోటి టీమ్ చౌటుప్పల్ పోలీసులు రంగంలోకి దిగి 360 కిలోల గంజాయిని తరలిస్తున్న ఆరుగురిని పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటి విలువ రూ.1.2 కోట్లుగా వుంటుందని అంచనా వేస్తున్నారు. 

9:36 AM IST: