తమ శారీరక కోరిక తీర్చుకోవడం కోసం ఐదుగురు యువకులు దారుణానికి ఒడిగట్టారు. ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటను వీడియోలు తీశారు. అనంతరం ఆ వీడియోలను యువతికి చూపించి బెదిరించడం మొదలుపెట్టారు. అక్కడితో ఆగలేదు... ఆ వీడియోని చూపించి యువతిని బెదిరించి... సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దానిని కూడా వీడియో తీసి... మరింత మనోవేదనకు గురిచేశారు. వాళ్ల బెదిరింపులు తట్టుకోలేక ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా ఆత్తూరు సమీపం అమ్మాపాళయం గ్రామానికి చెందిన ఒక విద్యార్థిని నామక్కల్ జిల్లా రాశీపురంలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతోంది. ఆమె కాలేజీకి వెళ్లే సమయంలో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. కాగా.... ఈ ప్రేమ జంటపై ఓ ఐదుగురు యువకులు నిఘా పెట్టారు. ఇటీవల ఒకరోజు ప్రేమికులిద్దరూ ‘ఏకాంతంగా’గడపడాన్ని రహస్యంగా తమ వీడియోలో చిత్రీకరించారు. ఆ వీడియో దృశ్యాలను ఇంట్లో చూపకుండా ఉండాలంటే తమ కోర్కె తీర్చాలని యువతిని బెదిరించారు. ఆపై ఆ యువతిని నగ్నంగా మార్చి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.

దానిని కూడా వీడియో తీశారు. తాము పిలిచినప్పుడల్లా వచ్చి తమ కోరిక తీర్చాలని లేదంటే... వీడియోలు బయటపెడతామంటూ బెదిరించడం మొదలుపెట్టారు. వాళ్ల బెదిరింపులు తట్టుకోలేక యువతి విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఇంటికి చేరుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.

గమనించిన తల్లి వెంటనే ఆస్పత్రిలో చేర్పిండంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. కాగా యువతిపై అత్యాచారానికి పాల్పడిన వారిలో కాలేజీ బస్సు డ్రైవర్ కూడా ఉండటం గమనార్హం. కాగా... బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.