తన లైంగిక వాంఛ తీర్చలేదని ఓ ఫోటోగ్రాఫర్.. మోడల్ ని దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది. ముంబయిలో కొద్ది నెలల క్రితం మన్సీ దీక్షిత్(20) అనే మోడల్ హత్యకు గురయ్యింది. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. 

పోలీసుల విచారణలో నిందితుడు నిజాలు బయటపెట్టాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం..మన్సీ దీక్షిత్.. మోడలింగ్ రంగంలో రాణించాలనుకుంది. ఆమెకు సయ్యద్ ముజమ్మిల్(19) అనే ఫోటో గ్రాఫర్ పరిచయమయ్యాడు. ఫోటోలు తీస్తానంటూ తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు.

ఫోటోలు దిగడానికి అందంగా ముస్తాబై.. మన్సీ.. సయ్యద్ ఇంటికి వెళ్లింది. అయితే.. ఫోటోలు తీయాలంటే.. తన లైంగిక వాంఛ తీర్చాలంటూ ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఓ స్టూలుతో తలపై కొట్టాడు. ఆమెపై దాడి చేసి, మెడకు లేసు, తాడు బిగించి హతమార్చాడు. అనంతరం ఓ సంచిలో మృతదేహాన్ని కట్టేసి క్యాబ్‌లో తీసుకెళ్లి ఓ ఫుట్‌పాత్‌ వద్ద వదిలి వెళ్లిపోయాడు. సంచిలో మృతదేహాన్ని గమనించిన డ్రైవర్‌ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం సయ్యద్ ని అతని అపార్టుమెంటు వద్దే పోలీసులు అరెస్టు చేశారు.