Asianet News TeluguAsianet News Telugu

ఈడీ ముందుకు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌ఠాక్రే: ముందస్తు అరెస్టులు

ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. గురువారం నాడు ఉదయం ఆయన ఈడీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. 

MNS workers detained before Raj Thackeray's ED questioning, Section 144 imposed outside Mumbai office
Author
Mumbai, First Published Aug 22, 2019, 10:40 AM IST

ముంబై: మహారాష్ట్ర  నవ నిర్మాణ్ సేవా చీఫ్ రాజ్ ఠాక్రేను ఈడీ అధికారులు గురువారం నాడు  ప్రశ్నించనున్నారు. దీంతో ఎంఎన్ఎస్  కార్యకర్తలను పోలీసులు ముందు జాగ్రత్తగా  అరెస్ట్ చేశారు. 

ముంబైలోనీ ఈడీ కార్యాలయం ఎదుట సీఆర్‌పీసీ 144  సెక్షన్  అమలు చేశారు. గురువారం నాడు ఉదయం రాజ్ ఠాక్రే ముంబైలోని ఈడీ కార్యాలయానికి హాజరుకానున్నారు. 

ఐఎల్, ఎఫ్ఎస్ విచారణలో భాగంగా ఈడీ అధికారులను ఆయనను ప్రశ్నించనున్నారు. కోహినూర్ లోని సీటీఎన్ఎల్ రాజ్ ఠాక్రే పెట్టుబడుల గురించి ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.

ముంబైలోని 12 జోన్లలో ఎంఎన్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై శివాజీ పార్క్ వద్ద ఎంఎన్ఎస్ నేత సందీప్ దేశ్‌పాండేను పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజ్ ఠాక్రే నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

 రాజ్ ఠాక్రే ఆదేశాలను తాము తప్పకుండా పాటిస్తామని ఆ పార్టీ నేత  సంతోష్ దూరి చెప్పారు.ఈ కేసులో ఇప్పటికే ఉమేష్ జోషీ, రాజేంద్ర శిరోడ్కర్ లను ఈడీ అధికారులు ప్రశ్నించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios