త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. నామినేషన్లు వేయడానికి ఇంకా కొద్ది రోజులే మిగిలివుంది. నామినేషన్ల ఆరవ రోజున సపనా సంజోయ్ అనే పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన అభ్యర్థి అత్యంత విచిత్ర రీతిలో నామినేషన్ దాఖలు చేశారు. 

నామినేషన్ వేయడం కోసం సంజోయ్ గేదెపై ఊరేగుతూ వచ్చాడు. ఈ విషయం స్థానికంగా చర్చకు దారి తీసింది. సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న సపనా సంజోయ్ పాలీగంజ్ కు చెందిన వ్యక్తి. 

గేదెపై ఊరేగుతూ ఎందుకు వచ్చారని అడిగిన మీడియా ప్రశ్నలకు సంజోయ్ తాను జంతు ప్రేమికుడినని సమాధానం ఇచ్చారు. అంతేకాదు గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఇలాగే గేదెపై కూర్చుని ఊరేగింపుగా వచ్చి నామినేషన్ వేశారని గుర్తు చేశాడు. 

అతా గేదెను నమ్ముకుని లాలూ సీఎం అయ్యారని, తాను కనీసం ఎమ్మెల్యేగా అయినా అవుతానని చమత్కరించాడు. అందుకే గేదెపై ఊరేగింపుగా వచ్చానని చెప్పుకొచ్చి ఆశ్చర్యపరిచాడు.