దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి వేడులకల్లో గాలిపటాలు ఎగురవేయడం ఓ సరదా. పండక్కి ముందు నుంచే గాలిపటాలు, ఎగురవేసేందుకు అవసరమైన దారాన్ని సిద్ధం చేసుకుంటారు పిల్లలు.

ఈ క్రమంలో రాజస్థాన్‌లో ఓ చిన్నారి గాలిపటం ఎగురవేస్తున్న దారానికి విద్యుత్ సరఫరా జరిగి దుర్మరణం పాలైంది. వివరాల్లోకి వెళితే.. జైపూర్‌లోని ఖర్ఘనీ ప్రాంతంలోని గణేశ్ వాటికలో నివసించే అష్రఫ్ ఖాన్ కుమార్తె ఆఫ్రీనో బానో శుక్రవారం తన ఇంటి మేడ మీద గాలిపటం ఎగురవేస్తోంది.

ఈ సమయంలో గాలిపటం దారం (మాంఝా) దగ్గరలోని హైటెన్షన్ వైర్లకు తాకడంతో విద్యుత్ ప్రసారం కావడంతో అఫ్రీనో షాక్‌కు గురైంది. తీవ్రగాయాలపాలైన చిన్నారిని కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చిన్నారి శుక్రవారం కన్నుమూసింది.