న్యూఢిల్లీ:ఆరోగ్య సేతు యాప్ ను ఎవరు క్రియేట్ చేశారో...దీన్ని ఎలా తయారు చేశారోననే సమాచారం కేంద్ర ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ , ఎన్ఐసీ, ఎన్‌ఈజీడీ వద్ద లేదని కేంద్ర సమాచార శాఖ అభిప్రాయపడింది. ఈ విషయమై ఈ శాఖలకు  కేంద్ర సమాచార శాఖ  మంగళవారం నాడు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 

కేంద్ర సమాచార కమిషన్ మంగళవారం నాడు సీపీఐఓ, కేంద్ర ఎలక్ట్రానిక్స్, నేషనల్ ఇన్పర్మేటిక్స్ సెంటర్, ఎన్‌ఈజీడీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

మీకు ఎందుకు జరిమానా విధించకూడదని కేంద్ర సమాచార కమిషన్ ప్రశ్నించింది. ఆరోగ్య సేతు యాప్ ఎలా తయారు చేశారు, ఎలా డెవలప్ చేశారో చెప్పాలని సీఐసీ ఎన్ఐసీని కోరింది.

ఈ విషయమై ఎన్ఐసీ వద్ద సరైన సమాచారం లేదని సీఐసీ అభిప్రాయపడింది. అంతేకాదు సీపీఐఓ, ఎన్ఐసీ ఈ వెబ్ సైట్ ను ఎలా తయారు చేశారో రాతపూర్వకంగా సమాధానం చెప్పాలని కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది.

ఆరోగ్య సేతుయాప్ https:// aarogyasetu.gov.in పేరుతో క్రియేట్ చేశారు. ఆరోగ్య సేతు యాప్ డొమైన్ gov.in తో క్రియేట్ చేపిన విషయం కూడ వారికి తెలియదని కేంద్ర సమాచార కమిషన్ తెలిపింది. 

ఈ యాప్ ను ఎవరు సృష్టించారు. ఫైళ్లు ఎక్కడ ఉన్నాయనే సమాచారం లేదని కేంద్ర సమాచార కమిషన్ తెలిపింది.ఈ విషయమై సీపీఐఓ డిప్యూటీ డైరెక్టర్ ఎస్ కే త్యాగి, డిప్యూటీ డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ డికె సాగర్,  సీనియర్ జనరల్ మేనేజర్ సీపీఐఓ ఎన్ఈజీడీ ఆర్ ధావన్ కు కేంద్ర సమాచార కమిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ఆరోగ్య సేతు యాప్ కు తయారీకి సంబంధించిన సమాచారం విషయమై సౌరవ్ దాస్ అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా ఎన్ఐసీ, ఎన్ఈజీడీ, కేంద్ర ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖలను కోరాడు. ఈ యాప్ ఎలా క్రియేట్ చేశారనే సమాచారం లేదని ఆయా శాఖలు తెలిపాయని ఆయన వివరించారు.