జైపూర్: పెళ్లైన తర్వాత వధువు కాళ్లను తాకాడు వరుడు. పెళ్లి తర్వాత అమ్మాయిలు పాటించే సంప్రదాయాన్ని అబ్బాయి పాటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు.

రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్ కు చెందిన దీపా ఖోస్లా ఉన్నత చదువుల కోసం అమ్‌‌స్టర్ డామ్ లోని ఓ విశ్వవిద్యాలయంలో చేరింది. అక్కడే ఆమెకు ఒలేగ్ బుల్లర్ తో పరిచయం ఏర్పడింది.

ఒలేగ్ బుల్లర్  స్టూడెంట్ లీడర్.  దీపా యూనివర్శిటీలో చేరిన ఆరు మాసాలకే ఆయన యూనివర్శిటీ క్యాంపస్ నుండి వెళ్లిపోయాడు. వీరిద్దరి పరిచయం ముందుకు సాగలేదు. అయితే పుట్టిన రోజున మాత్రమే మేసేజ్ లు చేసుకొనేవారు. 

ఇలా పుట్టినరోజున నాడు ఆమ్‌స్టర్ డామ్ లో డిన్నర్ కు కలుద్దామనుకొన్నారు. కానీ ఆ సమయంలో దీప లండన్ లో ఉంది. దీంతో డిన్నర్ చేయాలనుకొన్నారు. అయితే డిన్నర్ ను ఉదయ్ పూర్ లోని ప్యాలెస్ లో జరిగింది. 

డిన్నర్ సమయంలోనే ఓలెగ్  దీపను పెళ్లి చేసుకోవాలని కోరాడు.  ఓలెగ్ ప్రతిపాదనకు ఆమె ఒప్పుకొంది.దీంతో వీరిద్దరి వివాహం జరిగింది.  పెళ్లి జరిగిన తర్వాత అబ్బాయి పాదాలకు నమస్కరించాలని  పెద్దలు చెప్పారు. అయితే ఈ విషయమై  అమ్మాయిలే ఎందుకు అబ్బాయిల పాదాలను తాకాలని ఆయన ప్రశ్నించారు.

వెంటనే ఓలేగ్ దీప పాదాలను తాకాడు. ఈ విషయాన్ని దీప తన ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. పెళ్లైన తర్వాత వీరిద్దరూ పేర్లు కూడ మార్చుకొన్నారు.