జైన మతస్తులు తీర్థయాత్రలు చేసే మధ్యప్రదేశ్‌లోని కుండల్‌పూర్, ప్రసిద్ధ శివాలయం ఉన్న బందక్‌పూర్‌లు పవిత్ర క్షేత్రాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ రెండు పట్టణాల్లో మాంసం, మద్యం పూర్తిగా నిషేధిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. కుండల్‌పూర్‌లో సోమవారం పంచకళ్యాణ్ మహా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సీఎం ఈ ప్రకటన చేశారు.
భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక ప్రకటన చేశారు. జైన మతస్తులు తీర్థయాత్ర చేసే పట్టణం కుండల్‌పూర్, మరో పట్టణంలో మాంసం, మద్యాన్ని నిషేధిస్తూ ప్రకటించారు. కుండల్‌పూర్‌లో సోమవారం నిర్వహించిన పంచకళ్యాణ్ మహా మహోత్సవ్‌లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలోనే ఆయన పై ప్రకటన చేశారు.
జైన సన్యాసి ఆచార్య విద్యాసాగర్ జీ మహారాజ్ ప్రేరణతో తాను కుండల్‌పూర్, బందక్‌పూర్‌లలో మాంసం, లిక్కర్ విక్రయాలను పూర్తిగా నిషేధిస్తున్నామని ప్రకటించారు. దామోహ్ జిల్లాలోని ఈ రెండు పట్టణాలు పవిత్ర క్షేత్రాలు అని తెలిపారు. బందక్‌పూర్ శివాలయానికి ప్రతీతి చెందిన పట్టణం. విద్యాసాగర్ మహారాజ్ కోరిక మేరకు తమ ప్రభుత్వం ఏడాది లోపే మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులను హిందీలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో ఆయన గో రక్షణ కోసం, మొక్కలు నాటడానికి ప్రజలు ముందుకు రావాలని, తద్వార మంచి వాతావరణాన్ని ఏర్పరుచుకోవాలని కోరారు. ఈ నెలలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ ఇదే తరహా ప్రకటన చేశారు. భోపాల్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో వచ్చే విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ కోర్సును హిందీ భాషలో ప్రారంభిస్తామని ప్రకటించారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రాని కంటే ముందే కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి ప్రకటనలు వెలువడ్డాయి. గుజరాత్‌లోనూ మాంసం తినడంపై ఆంక్షలు విధించడానికి రంగం సిద్ధం చేస్తున్నది. గుజరాత్ ఇకపై వెజెటేరియన్ రాష్ట్రంగా ఉంటుందని 2017లో గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. కాగా, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రోడ్లపై మాంసం అమ్మడంపై నిషేధం విధిస్తూ ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. మాంసం, చేపలు, గుడ్లను మెయిన్ రోడ్లపై అమ్మవద్దని, స్కూల్స్, కాలేజీలు, విద్యా సంస్థలకు వంద మీటర్ల దూరం మేరకు వీటి విక్రయాలు చేపట్టవద్దని ఆదేశించింది.
మద్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో షాకిచ్చింది. ఇతర రాష్ట్రాల నుండి మూడు మద్యం బాటిల్స్ ను తీసుకొనేందుకు రాష్ట్రంలో అప్పటి వరకు అనుమతి ఉంది. అయితే ఈ అనుమతిని ఎత్తివేసిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుండి మద్యం తెచ్చుకోవడంపై ఏపీ హైకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్ 2న కీలక తీర్పు ఇచ్చింది.411 జీవో ప్రకారంగా 3 మద్యం బాటిళ్లను తీసుకురావచ్చని ఏపీ హైకోర్టు చెప్పింది. అయితే ఈ జీవోను అమలు చేయాలని రిట్ పిటిషన్ లో తీర్పు ఇచ్చిన హైకోర్టు. దీంతో ఇతర రాష్ట్రాల నుండి మద్యం తెచ్చుకొనే వెసులుబాటు అమల్లోకి వచ్చింది.
దీంతో రాష్ట్రానికి విచ్చలవిడిగా ఇతర రాష్ట్రాల నుండి మద్యం వస్తోంది.సరిహద్దుల్లో పెద్ద ఎత్తున పోలీసులు అక్రమంగా మద్యం తరలిస్తున్నవారిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ప్రతి రోజూ వందలాది బాటిల్స్ మద్యం రాష్ట్రంలోకి వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడ ఆదాయాన్ని కోల్పోతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన 411 జీవోకు సవరణలు చేస్తూ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుండి మూడు మద్యం బాటిల్స్ ను తెచ్చుకోవాలంటే ముందుగా ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాల్సిందే. అంతేకాదు ఈ మేరకు ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సిందే.
