ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు.  గూడ్స్ రైలు ఇంజన్ కి నిప్పు పెట్టడంతో విశాఖపట్టణం కిరండోల్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

రాయ్ పూర్: Chhattisgarh రాష్ట్రంలోని Dantewada జిల్లాలో మావోయిస్టులు దారుణానికి తెగబడ్డారు. గూడ్స్ రైలు ఇంజన్ కి మావోయిస్టులు నిప్పు పెట్టారు. దీంతో విశాఖపట్టణం-Kirandulమార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మంగళశారం నాడు అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు తెలిపారు.

కిరండోల్ నుండి Visakhapatnamకి ఓరన్ ఓర్ తో వెళ్తున్న గూడ్స్ రైలు ఇంజన్ ను మావోయిస్టులు దగ్దం చేశారు. ఈ విషయం తెలుసుకొన్న భద్రతా సిబ్బంది ఈ మార్గంలో కూంబింగ్ చేపట్టారు. రైల్వే ట్రాక్ ను క్లియర్ చేసి రైళ్ల రాకపోకలను పునరుద్దరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.