కేవలం నిమిషంలో.. 109 పుష్ అప్స్ చేశాడు. దీంతో.. అతను గిన్నీస్ రికార్డ్ సాధించాడు.  ఈ సంఘటన మణిపూర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కృషి ఉంటే మనుషులు రుషులు అవుతారు... మహా పరుషులు అవుతారు.. అనే పాట వినే ఉంటారు. ఇది అక్షరాల సత్యం. మనకు సాధించాలనే పట్టుదల, కృషి ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. తాజాగా.. దీనిని ఓ యువకుడు నిరూపించాడు. కేవలం నమిషంలో.. 109 పుష్ అప్స్ చేశాడు. దీంతో.. అతను గిన్నీస్ రికార్డ్ సాధించాడు. ఈ సంఘటన మణిపూర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మణిపూర్ కు చెందిన 24ఏళ్ల థౌనఓజమ్ నిరంజోయ్ సింగ్ నిమిషం వ్యవధిలో 109 పుష్ అప్స్ చేసి గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టాడు. 2009లో బ్రిటన్ కు చెందిన గ్రహం మాలే అనే వ్యక్తి పేరిట ఉన్న రికార్డును నిరంజోయ్ తిరగరాశాడు. అయితే ఇదేమంతా ఆషామాషీగా జరిగిందేం కాదు.. దాని వెనుక 13 ఏళ్ల కఠోర శ్రమ దాగి ఉంది. 

Scroll to load tweet…

నిరంజోయ్ గిన్నిస్ రికార్డులకెక్కడం ఇదే మొదటిసారి కాదు. అతని పేరిట ఇప్పటికే రెండు గిన్నిస్ రికార్డులు ఉన్నాయి. 2019లో ఒక్క నిమిషంలో అత్యధిక వన్ ఆర్మ్, వన్ లెగ్ పుషప్స్ తోపాటు 2020లో వన్ ఆర్మ్ పుషప్స్ చేసిన ఘనత నిరంజోయ్ సొంతం. మణిపూర్ కు చెందిన యువకుడు గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు సంతోషం వ్యక్తం చేశారు. నిరంజోయ్ విజయం పట్ల గర్వంగా ఫీలవుతున్నానంటూ ట్వీట్ చేశారు. గిన్నిస్ రికార్డు బద్దలుకొట్టిన అతన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.