అన్న భార్య(వదన)ని తల్లి తర్వాత తల్లిగా భావిస్తుంటారు. అలాంటి వదినపై కామంతో కళ్లు మూసుపోయిన ఓ మరిది.. దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. వాటిని చూస్తూ ఊరుకోని ఆ ఇంటి పెద్ద.. కన్నకొడుకుని దగ్గర ఉండి మరీ పోలీసులకు అప్పగించాడు. ఈ సంఘటన పశ్చిబ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని రజార్ హట్ పట్టణంలోని హరోకల్ ప్రాంతానికి చెందిన జాంతు సర్దార్(40) తల్లిలాంటి వదినపై కన్నేశాడు. ఆమెను ప్రతిరోజూ లైంగికంగా వేధించాడు. ఆమెను అత్యాచారం చేయాలనే దురాశతో.. ఆమెను గదిలోకి లాక్కెల్లాడు.  కాగా.. అది గమనించిన  సర్దార్ తండ్రి(70) అతనిని అడ్డుకున్నాడు.

తన పెద్ద కొడుకు భార్యపై చిన్న కొడుకు లైంగిక దాడికి పాల్పడటం చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే..తన కోడలి జోలికి వస్తే.. చంపేస్తానని కత్తితో కొడుకును బెదిరించి.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కన్నకొడుకుని పోలీసులకు అప్పగించాడు. తన పెద్దకోడలిని కామాంధుడి భారి నుంచి రక్షించాడు. కాగా.. ఈ మేరకు పోలీసులకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.