భార్య సునీతకు అక్రమ సంబంధం ఉందనే అనుమానం భర్త రవిని రాక్షసుడిగా మార్చింది. దీంతో వాగ్వాదాలు ముదిరి కొబ్బరికాయలు కొట్టే కొడవలితో భార్యను, అడ్డువచ్చిన అత్తను అడ్డంగా నరికేశాడు.. ఆ తరువాత రక్తంతో తడిసిన బట్టలతో..
బెంగళూరు : extramarital affair అనుమానం ఓ నిండు కుటుంబాన్ని పొట్టన పెట్టుకుంది. Bengaluruలో 42 ఏళ్ల ఓ వ్యక్తి రక్తంతో నిండిన బట్టలతో పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. తన భార్యను, అత్తగారిని murder చేశానని చెప్పి లొంగిపోయాడు. ఈ సంఘటన మూడలపాళ్యం సమీపంలోని సంజీవిని నగర్‌లో ఫిబ్రవరి 21 మంగళవారం జరిగింది. అతన్ని అలా చూసి పోలీసులు ఖంగు తిన్నారు. ఆ తరువాత అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వివరాల్లోకి వెడితే.. సంఘటన జరిగిన రోజు పిల్లలను స్కూల్‌లో దించి ఇంటికి వచ్చాడు రవికుమార్. ఆ తరువాత ఉదయం 10.15 గంటల సమయంలో అతడికి, అతని భార్య సునీత (38) మధ్య వాగ్వాదం జరిగింది. దీనికి కారణం గత ఆరు నెలలుగా సునీత ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని రవికి అనుమానం కలగడమే. అదే విషయం మీద ఈ వాగ్వాదానికి గంట ముందు ఉదయం 9.00 గంటల ప్రాంతంలో ఆమెతో గొడవ కూడా జరిగింది.
డెక్కన్ హెరాల్డ్ నివేదికల ప్రకారం, ఉదయం 10.15 గంటల సమయంలో ఈ వాదన అదుపు తప్పింది, దీంతో కోపోద్రిక్తుడైన రవి కొబ్బరికాయలు ఒలిచే కొడవలిని తీసుకొని భార్యపై దాడికి ప్రయత్నించాడు. ఆ సమయంలో వారింట్లోనే ఉన్న సునీత తల్లి సరోజమ్మ (60) తన కుమార్తెను రక్షించేందుకు ముందుకు వచ్చింది. దీంతో కొడవలి ఆమె తలకు తగిలి నేలపై కుప్పకూలింది.
తన తల్లిపై జరిగిన దాడితో కోపోద్రిక్తులైన సునీత, రవి కుమార్‌పై అరవడం ప్రారంభించింది, దీంతో అతను మరింత రెచ్చిపోయాడు. భార్యపై దాడిలో దూకుడు పెంచాడు. కొడవలితో విచక్షణారహితంగా పొడుస్తూ అత్తా, భార్య చనిపోయే వరకు ఇద్దరు దాడి చేస్తూనే ఉన్నాడు.
ఆ తరువాత రవికుమార్ ఇంటికి తాళం వేసి.. ఉదయం 10.45 గంటలకు చంద్రా లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లాడు. సబ్‌ఇన్‌స్పెక్టర్ నవీన్ కలుసుకుని తన ఇంటి తాళాన్ని టేబుల్‌పై పెట్టాడు. తాను చేసిన హత్యల గురించి చెప్పి.. నేరం అంగీకరించి లొంగిపోయాడు. ఇదంతా విన్న సబ్-ఇన్‌స్పెక్టర్, తన సీనియర్లకు సమాచారం అందించాడు. ఆ తరువాత రవి కుమార్ ఇంటికి చేరుకున్నాడు. రవి ఇంట్లోకి వెళ్లగానే అతను చెప్పిందంతా నిజమేనని సబ్-ఇన్‌స్పెక్టర్ కు అర్థం అయ్యింది.
శివమొగ్గకు చెందిన రవికి 18 ఏళ్ల క్రితం సునీతతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు, 17 ఏళ్ల కుమారుడు, ఎనిమిదేళ్ల కుమార్తె ఉన్నారు. అతను కొబ్బరికాయలు అమ్మేవాడు, కానీ ఇటీవల బేకరీలో పని చేయడం ప్రారంభించాడు. ఇటీవల గత కొద్ది రోజులుగా తాము నివసించే ప్రాంతంలోని కొంతమంది వ్యక్తులతో సునీత అక్రమ సంబంధం పెట్టుకుందని కుమార్ అనుమానిస్తున్నాడు.
ఈ కారణంగానే గత ఆరు నెలలుగా ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇరుపెద్దలు సమస్యను పరిష్కరించినప్పటికీ రవి శాంతించలేదు. అయితే సునీతకు నిజంగానే అక్రమ సంబంధం ఉందా లేదా అనే విషయంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తదుపరి విచారణలు కొనసాగుతున్నాయి.
