Asianet News TeluguAsianet News Telugu

హిందూ మైనర్ బాలికపై ముస్లిం యువకుడి అత్యాచారం .. పెళ్లి చేసుకోవాలంటే.. మతం మారాలని కండిషన్

కర్ణాటకలోని మాండ్యా పోలీసులు యూనస్ పాషా అనే ముస్లిం యువకుడిని అరెస్ట్ చేశారు. ఆ యువకుడు హిందూ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని,వివాహం కోసం మతం మార్చుకోవాలని షరతు పెట్టాడని ఆరోపించారు.

Man rapes, blackmails teen to convert to Islam in Karnataka, arrested
Author
First Published Nov 23, 2022, 6:43 PM IST

13 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. బ్లాక్ మెయిల్ చేసి..అత్యాచారం చేశారు. తీరా తనపై మోజు తీరగా.. మతం మారితేనే పెళ్లి చేసుకుంటానని.. లేదంటే.. పర్సనల్ ఫోటోలను బయట పెడుతానని ఓ కామాంధుడు వేధింపులకు గురి చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. రంగంలో దిగిన పోలీసులు ఆ కామాంధుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై మతమార్పిడి నిరోధక చట్టం,పోక్సో చట్టం కింద అభియోగాలు మోపారు. నిందితుడికి ఇప్పటికే పెళ్లి అయ్యింది. పిల్లలు కూడా ఉన్నాడు . ఈ ఘటన కర్నాటకలోని మాండ్య జిల్లా నాగమంగళ ప్రాంతంలో చోటు చేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిందితుడు యూనస్‌ పాషా అలియాస్‌ ఫయాజ్‌ మహ్మద్‌, మైనర్ బాధితురాలు ఇరుగుపొరుగు వారు. యూనస్ వివాహితుడు. అతడు ఒక బిడ్డకు తండ్రి కూడా. కానీ, తన ఇంటి ముందు ఉండే.. 13 ఏండ్ల బాలికపై కన్నేశాడు. ఎలాగైనా ఆ బాలికను లొంగదీసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులకు తెలియకుండా.. స్మార్ట్‌ఫోన్‌ను బహుమతిగా ఇచ్చాడు. క్రమంగా సన్నిహితంగా మెలగడం ప్రారంభించారు. వారి మధ్య తొలుత చాటింగ్, ఆ తరువాత వీడియో కాల్స్ ప్రారంభమయ్యాయి. వీరిద్దరి మధ్య అనుబంధం క్రమంగా పెరుగుతు వచ్చింది. వారి మధ్య చనువు శ్రుతి మించింది. అసభ్యకరమైన ఫోటోలు, న్యూడ్ వీడియోలు షేర్ చేసుకునే స్థాయికి వెళ్లింది.ఆ తర్వాత యూనస్ బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేసి శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆ బాలిక నిరాకరించడంతో వారి ప్రైవేట్ చాట్‌లు,అసభ్యకరమైన ఫోటోలను ఆమె కుటుంబ సభ్యులకు వెల్లడిస్తానని బెదిరించడం ప్రారంభించాడు.

ఈ క్రమంలో నవంబరు 8న బాలికను నానమ్మ వద్ద వదిలి బాలిక కుటుంబం నాలుగు రోజుల పాటు షిర్డీకి వెళ్లింది. నిందితులు పరిస్థితిని అనుకూలంగా మలుచుకుని నవంబర్ 10న బాలిక అమ్మమ్మకు బలవంతంగా నిద్రమాత్రలు కలిపిన ఆహారాన్ని అందించాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగానే.. నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. నవంబర్ 12న షిర్డీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత బాలిక ప్రవర్తనలో మార్పు కనిపించడంతో తల్లిదండ్రులు ఏం జరిగిందో ఆరా తీశారు. అసలు విషయం తెలియడంతో షాక్ గురయ్యారు. అనంతరం బాలిక తల్లిదండ్రులు నవంబర్ 19న పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇస్లాం మతంలోకి మారాలన్న షరతుతో యువతిపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత యూనస్ పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. 

“8వ తరగతి చదువుతున్న తన 13 ఏళ్ల కుమార్తెను తమ ఇంటికి ఎదురుగా నివసిస్తున్న వ్యక్తి మొదట బ్లాక్ మెయిల్ చేశాడని బాలిక తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఓ రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారం చేసి, పెళ్లి చేసుకోవాలంటే.. మతం మారాలని బలవంతం చేశాడని ఫిర్యాదులో పేర్కోన్నారు.” మేము నిందితుడిని అరెస్టు చేశాం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయబడింది. ఫిర్యాదుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాము ”అని మాండ్యా పోలీసు సూపరింటెండెంట్ ఎన్ యతీష్ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios