ఓ వ్యక్తి స్నేహానికే ద్రోహం చేశాడు. మిత్రుడికి తెలీకుండా అతని భార్యపై కన్నేశాడు. అదును చూసుకొని ప్రసాదంలో మత్తు మంది కలిపి ఆమెకు పెట్టాడు. స్పృహ కోల్పోయి నిస్సహాయ స్థితిలతో ఉన్న ఆమెను నగ్నంగా మార్చి వీడియోలు చిత్రీకరించాడు. అనంతరం మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... చెన్నై విరుగంబాక్కం గాంధీనగర్ ప్రాంతానికి చెందిన మహిళ(26)కు పెళ్లైంది. ఆమె  భర్త వడ్రంగి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా... అతనికి గతంలోనే వివాహమైంది. ఆమె చనిపోవడంతో... ఈ మహిళను రెండో వివాహం చేసుకన్నాడు. ఇదిలా ఉండగా... మహిళ భర్త వడ్రంగి పని మీద గత జులై నెలలో వేరే ప్రాంతానికి రెండు నెలలు వెళ్లాడు. పని పూర్తయ్యిన తర్వాత ఆయన ఇంటికి వచ్చాడు.

ఇంటికి వచ్చేసరికి బార్య మెడలో ఉండాల్సిన బంగారు నగ కనిపించలేదు. ఏమైందని భార్యను ప్రశ్నించాడు. అందుకామె మీ స్నేహితుడు వినోద్‌కుమార్‌ (30), హరీష్‌కుమార్‌ మీరు ఊరెళ్లిన సమయంలో ప్రసాదం అంటూ మత్తుమందిచ్చి తనపై అత్యాచారం జరిపి మూడు సవర్ల బంగారు నగ అపహరించినట్లు తెలిపింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన భర్త, భార్యతో కలిసి దీనిపై బుధవారం టీ.నగర్‌ డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వినోద్‌కుమార్, సతీష్‌కుమార్‌పై కేసు నమోదు చేసి ఇరువురి కోసం గాలిస్తున్నారు. 

అతను గ్రామంలో లేని విషయం గమనించి.. అతని స్నేహితుడు వినోద్ కుమార్.. ప్రసాదం ఇచ్చే వంకతో అక్కడికి వచ్చాడు. దేవుడి ప్రసాదం అని మత్తుమందు కలిపిన కేసరిని ఆమెకు పెట్టాడు. అది తిని స్పృహ కోల్పోయిన ఆమెపై అత్యాచారం చేశాడు.అనంతరం ఆమెను బెదిరించి బంగారు నగ తీసుకువెళ్లాడు. కాగా.. భర్త ఊళ్లో లేకపోవడంతో ఆమె ఇన్ని రోజులు ఈ విషయం ఎవరికీ చెప్పకపోవడం గమనార్హం. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.