ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ లో ఘోరం జరిగింది. కూతురిని కాల్పులు జరిపి హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పైగా, ముగ్గురు వ్యక్తులు తన కూతురిని చంపారని ఫిర్యాదు చేశాడు. లైంగిక వేధింపులను ప్రతిఘటించినందుకు వారు తన కూతురిని హత్య చేశారని ఆరోపించాడు. 

ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరితో తన కూతురు సంబంధం పెట్టుకోవడంతో తీవ్ర అసంతృప్తికి గురై అతను ఆమెను హత్య చేశాడని పోలీసులు చెప్పారు. ముగ్గురు వ్యక్తులు తన ఇంట్లోకి చొరబడి తన కూతురిని నాటు రివాల్వర్ తో కాల్చి చంపారని అతను ఆరోపించాడు. 

సవివరమైన దర్యాప్తు చేసిన తర్వాత, చాలా మందిని విచారించిన తర్వాత ఆ ముగ్గురు వ్యక్తులు నేరం చేయలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నేరం జరిగిన సమయంలో సంఘటనా స్థలంలో ఆ ముగ్గురు వ్యక్తులు లేరని కాల్ జిటైల్స్ రికార్డుల ద్వారా, వారి ఫోన్ల లోకే,న్ ఆధారంగా పోలీసులు స్పష్టం చేసుకున్నారు. 

మృతురాలి కుటుంబ సభ్యులు కూడా పరస్పర విరుద్ధమైన విషయాలు చెబుతూ వచ్చారు. ఆ ముగ్గురిలో ఓ వ్యక్తితో కూతురు సంబంధం పెట్టుకోవడంతో నిందితుడు ఆగ్రహించి నేరం చేశాడని నిందితుడి సోదరుడు చెప్పాడు.

నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు పోలీసులు తమ అదుపులోకి తీసుకున్న ఇద్దరిని త్వరలో విడుదల చేయనున్నారు. శుక్రవారం ఘటన జరగగా, శనివారం నాడు నిందితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, అతను తప్పుడు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు.