కేవలం 100 రూపాయల కోసం ఓ మహిళను అత్యంత దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని కామాఠిపురా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అక్కడికి దగ్గరలోని ఓ సెక్స్‌వర్కర్‌తో గడిపేందుకు రూ.500లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

అయితే ఆ వ్యక్తి ఆమెను రూ.100 తిరిగి ఇచ్చేయమన్నాడు. దీనికి సెక్స్‌‌వర్కర్‌ నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను కసితీరా 3 సార్లు పొడిచి చంపాడు.

ఆ దారిలో వెళుతుండగా మహిళ అరుపులు విన్న ఓ వ్యక్తి దుండగుడి బారి నుంచి ఆమెను రక్షించడానికి అటుగా వెళ్లాడు. దీంతో అతడిపైనా నిందితుడు దాడి చేసి పొడిచాడు. ఈ నేపథ్యంలో స్పందించిన చుట్టు పక్కలవారు ఆస్పత్రిలో చేర్చారు.

ప్రస్తుతం అతని పరిస్ధితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని క్యాటరింగ్ చేసే వ్యక్తిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.