అందరూ దీపావళి పండగ జరుపుకుంటూ ఆనందంగా సంబరాలు చేసుకుంటుంటే... ఓ ఎలుక.. ఇంటిని తగలపెట్టింది. ఎలుక కారణంగా సిలిండర్ పేలి... ఇంటి తలుపులు ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ లోని బరేలి లోని సుభాష్ నగర్ పరిధిలోని బెహటీ గ్రామ వాసి సంతోష్.. తన కుటుంబసభ్యులతో కలిసి దీపావళి పండగ జరుపుకుంటున్నాడు. వారికి రెండంతస్థుల భవనం ఉంది. కాగా..కుటుంబ సభ్యులు పైఅంతస్థులో దీపం వెలిగించి వచ్చి... టపాకాయలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. 

ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ ఎలుక  కొద్దిగా వెలుగులుతున్న దీపవు ఒత్తిని తీసుకువెళ్లి గ్యాస్ సిలిండర్ పైప్‌పైన పెట్టింది. దీంతో సిలిండర్ పేలింది. ఆ శబ్ధం వినగానే సతీష్, అతని కుటుంబసభ్యులు మంటలను ఆపేందుకు ప్రయత్నించారు. 

కాగా ఈ సమయంలో  సతీష్, అతని  కుమారుడు సుభాష్ గాయపడ్డారు. కాగా వారిని  వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు.అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి పంపించారు. ఈ ప్రమాదంలో ఇంటిలోని 45 వేల రూపాయల నగదు, విలువైన నగలు దగ్ధమయ్యాయి. ఎలుక కారణంతా తాము తీవ్రంగా నష్టపోయామని వారు చెబుతున్నారు.

ఎలుక చేసిన పని కారణంగా సిలిండర్ పేలడంతో ఆ ఇంటిలోని తలుపులు ధ్వంసమయ్యాయి. ఇంటిలోని వస్తువులన్నీ తగులబడ్డాయి. ఈ ఘటనలో ఇంటి యజమానితో పాటు అతని కుమారుడు గాయాలపాలయ్యాడని స్థానికులు చెప్పడం విశేషం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.