ఒడిశాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి బహిర్భూమికి వెళ్లిన ఎనిమిదేళ్ల బాలిక మీద దాడి చేశాడు. గొడ్డలితో తలనరికి.. చేతిలో పట్టుకుని ఊరంతా తిరిగాడు. చివరికి ఇంటికి వచ్చి నేలపై పడుకుని నిద్రపోయాడు..

సంబల్‌పూర్ : odisha లోని జాజ్‌పూర్ జిల్లాలో దారుణఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఓ గ్రామంలో శుక్రవారం నాడు ఓ వ్యక్తి 8 year old girlను నరికి చంపాడు. ఆ తరువాత severed headతో గ్రామంలో తిరగడం మొదలు పెట్టాడు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన 30 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు వారు శనివారం వివరాలు తెలిపారు.

అయితే, జమన్‌కిరా బ్లాక్‌లోని గ్రామంలో సంచలనం సృష్టించిన ఈ దారుణ ఘటన కలకలం సృష్టించింది. అయితే ఇలా చేయడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటనేది ఇంకా తెలియరాలేదని పోలీసలు తెలిపారు. శుక్రవారం తెల్లవారి బాలిక కాలకృత్యాలు తీర్చుకునేందుకు వ్యవసాయ భూమికి వెళ్లింది. ఆ సమయంలో గొడ్డలితో అక్కడికి వెళ్లిన నిందితులు ఆ చిన్నారి తల నరికి చంపారు. అనంతరం తెగిపడిన తలను పట్టుకుని గ్రామంలో తిరుగుతూ గొట్టపు బావి వద్దకు వెళ్లి గొడ్డలిని కడిగాడు. 

ఇది నిందితుడి భార్య గమనించింది. వెంటనే ఏం చేశావ్.. చంపావా అంటూ భయాందోళనలతో అతడితో తీవ్ర వాగ్వాదానికి దిగింది, అయితే అప్పటికే హత్య చేసిన మూడ్ లో ఉన్న నిందితుడు ఆమెను కూడా గొడ్డలితో బెదిరించాడు. అనంతరం నిందితుడు అక్కడే తలను పక్కన పెట్టి నేలపై పడి నిద్రపోయాడు. తల పట్టుుకుని గ్రామంలో తిరుగుతున్న సమయంలో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

నిందితుడు పడుకున్ తరువాత ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో అతడు మద్యానికి బానిసైనట్లు తేలిందని, ఘటన జరిగిన సమయంలో కూడా అతను బాగా తాగి ఉన్నాడని తెలిపారు. కాగా, చనిపోయిన బాలిక కుటుంబంతో అతడికి ఎలాంటి శత్రుత్వం కూడా లేదని కూచింద సబ్‌డివిజనల్ పోలీసు అధికారి రాజ్‌కిషోర్ మిశ్రా తెలిపారు.

"అతను నేరం చేసినప్పుడు అతడి మనస్సులో ఏముందో, ఎందుకు హత్య చేశాడో.. ఏం అనుకున్నాడో.. మాకింకా అర్థంకావడం లేదు’’ అని పోలీస్ అధికారులు తెలిపారు. నిందితుడికి పెళ్లై, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నిత్యం తాగి వచ్చి కుటుంబసభ్యులతో వాగ్వాదానికి దిగడం నిత్యకృత్యమని, అయితే మానసికంగా కుంగిపోయే వ్యక్తి కాదని గ్రామస్తులు చెబుతున్నారు.

నిందితుడిని అదుపులోకి తీసుకున్న తరువాత హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని, బాలిక మృతదేహాన్ని శవపరీక్షకు పంపామని, విచారణ కొనసాగుతోందని జమన్కిరా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్‌జీత్ దాస్ తెలిపారు.

ఇదిలా ఉండగా, ఈ జనవరిలో నల్గొండలో మొండెంలేని తల కలకలం రేపింది. కలకలం రేపి Chintapalli Zoneలో మొండెం లేని head కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మంగళవారం హతుడి వివరాలు కనుగొన్నారు. సోమవారం ఉదయం చింతపల్లి మండల పరిధిలో brutal murderకు గురైన వ్యక్తి వివరాలను పోలీసులు కనుగొన్నారు.

గొల్లపల్లి గ్రామంలోని విరాట్ నగర్ లో సాగర్ హైవే పక్కన గల mettu Mahankali అమ్మవారి పాదాల దగ్గర గుర్తు తెలియని వ్యక్తి తల భాగాన్ని.. గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్ళిన సంగతి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటన నియోజకవర్గ వ్యాప్తంగా కలకలం రేపడంతో జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఆదేశాలతో దేవరకొండ డిఎస్పీ ఆనంద్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు అరు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేసి హతుడి వివరాలను కనుగొన్నారు. 

హతుడు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యంపాడు తండాకు చెందిన జయేందర్ నాయక్ (24) దిగా తండ్రి శంకర్ నాయక్ గుర్తించాడని పోలీసులు తెలిపారు. జయేందర్ నాయక్ మతిస్థిమితం కోల్పోయి గత 18 నెలలు క్రితం ఇంటి నుండి వెళ్లిపోయి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భిక్షాటన చేసేవాడని తెలిపారు. ఇంటి నుండి వెళ్లిపోయిన కుమారుడు 18 నెలల తర్వాత ఈరోజు ఇంత దారుణ హత్యకు గురయ్యాడని పోలీసుల ద్వారా తెలుసుకున్న 
కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.