మహారాష్ట్రలో దారుణం జరిగింది. పెళ్లి పేరుతో ఓ యువతిపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న యువతిని థానే పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడో యువకుడు. 

పెళ్లి పేరుతో 21 ఏళ్ల యువతిపై రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిమీద బాధిత యువతి గతవారం స్వయంగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

పోలీసుల సమాచారం ప్రకారం.. తానేలోని గౌతమ్ నగర్ కు చెందిన 21 యేళ్ల యువతికి ఖాన్ అనే వ్యక్తితో 2018లో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. 

ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా అంటూ ఆమెను లైంగికంగా వాడుకున్నాడు. ఇలా పెళ్లి పేరుతో 2018 నుంచి 2020 వరకు ఆ యువతి ఇష్టానికి వ్యతిరేకంగా ఖాన్ 
 అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. యేళ్లు గడిచిపోతున్నా పెళ్లి ఊసెత్తకపోతుండడంతో,  బాధిత యువతి గతేడాది అక్టోబర్‌ నుంచి ఖాన్‌ను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడం మొదలుపెట్టింది. 

దీంతో ఖాన్ మాట్లాడటం, ఫోన్‌ చేయడం తగ్గించేశాడు. విసిగిపోయిన బాధితురాలు తానే పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయం చెప్పి ఖాన్‌పై ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ఖాన్ మీద ఐపీసీ సెక్షన్‌ 376తో సహా పలు కేసులు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.