Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ విఫలం.. అందరి చూపు దీదీ వైపే.. విపక్ష కూటమి బాధ్యత ఆమెదే: టీఎంసీ

టీఎంసీ మరోసారి కాంగ్రెస్‌పై ఘాటు విమర్శలు చేసింది. కాంగ్రెస్ ఒక విఫల పార్టీ అని, యూపీఏ కథ ముగిసిందని టీఎంసీ మౌత్‌పీస్ జాగో బంగ్లా పత్రికలో ఎడిటోరియల్ రాసింది. అంతేకాదు, నేడు ప్రతిపక్షాల ఐక్యత అవసరమని, వాటిని ఐక్యం చేసే బాధ్యత టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీదేనని వివరించింది. ఇప్పుడు అసలైన ప్రతిపక్ష నేతగా మమతా బెనర్జీకే అధిక ఆమోదం ఉన్నదని తెలిపింది.
 

mamata banerjee is most acceptable oppositions leader says TMC
Author
New Delhi, First Published Dec 3, 2021, 2:18 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతిపక్షాల ఇప్పటి నుంచే రగడ మొదలైంది. BJPని ఎదుర్కోవడానికి Congress సారథ్యంలో ప్రతిపక్షాలు పోటీ చేస్తాయని సాధారణంగా అందరూ అంచనా వేశారు. అయినప్పటికీ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్‌(TMC)కు మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉన్నది. ప్రతిపక్షాల(Opposition)కు నాయకత్వం వహించడంపై ఈ రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటి వరకు ప్రతిపక్షం నుంచి ప్రత్యర్థిగా రాహుల్ గాంధీ ఉంటారనే చర్చ ఉండేది. కానీ, ఇప్పుడు ఆ చర్చను తిరగేసేలా టీఎంసీ వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీని ఎదుర్కోవాలంటే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని, విపక్షాలను ఏకతాటి మీదకు తెచ్చే బాధ్యతను టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ చేతిలో ఉన్నదని టీఎంసీ తన మౌత్‌పీస్ జాగో బంగ్లా పేపర్‌లో పేర్కొంది. అంతేకాదు, ఇప్పుడు ప్రతిపక్షం అంటే అందరూ మమతా బెనర్జీ వైపే చూస్తున్నారని వివరించింది. సమర్థమైన ప్రత్యర్థిగా ఇప్పుడు ఆమెకే ఎక్కువ ఆమోదం ఉన్నదని పేర్కొంది.

కాంగ్రెస్‌కు టీఎంసీకి మధ్య కొన్నాళ్లుగా వాగ్వాదం జరుగుతున్నది. పశ్చిమ బెంగాల్ నుంచి ఇతర రాష్ట్రాలకు వ్యాపించే ప్రయత్నాల్లో టీఎంసీ ఉండటమే కాదు, పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు కౌంటర్ ఇవ్వాలనే యోచనలో ఉన్నది. ఈ క్రమంలోనే ఇప్పుడు యూపీఏ లేనే లేదని మమతా బెనర్జీ ఇటీవలే కామెంట్ చేశారు. అంతేకాదు, ఇతర పార్టీల ముఖ్య నేతలతోనూ ఆమె చర్చలు జరుపుతున్నారు. శివసేన, ఎన్సీపీ సహా పలుపార్టీల నేతలతో ఆమె సమావేశాలు జరుపుతున్నారు. ఆమె తన ఢిల్లీ పర్యటనలోనూ పలువరు పార్టీల నేతలతో భేటీ అయ్యారు. ఈ తరుణంలోనే తాజాగా, జాగో బంగ్లాలో కీలకమైన ఎడిటోరియల్ ప్రచురించారు.

Also Read: యూపీఏది ముగిసిన చరిత్ర: శరద్ పవార్‌తో బెంగాల్ సీఎం మమత బెనర్జీ భేటీ

కాంగ్రెస్ ఇప్పుడు డీప్ ఫ్రీజర్‌లో ఉన్నదనే హెడింగ్‌తో ఆ ఎడిటోరియల్ అచ్చయింది. కాంగ్రెస్ విఫలమైందని, యూపీఏ కథ  కూడా ముగిసిందని టీఎంసీ ఆ ఎడిటోరియల్‌లో పేర్కొంది. అంతర్గతంగానూ ఆ పార్టీ నాయకత్వంపై అసంతృప్తులు ఉన్నాయని తెలిపింది. అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాలను నిర్మించకుండా తనను తాను ఫ్రీజర్‌లో నిర్బంధించుకుందని ఆరోపించింది. ఇంటికే పరిమితమై కేవలం ట్వీట్లు చేస్తున్నదని మండిపడింది. కాంగ్రెస్ శక్తి అంతా వృథా అయిపోయిందని తెలిపింది. కాంగ్రెస్ నాయకత్వంపై ప్రశ్నలు వస్తున్నా, కనీసం వాటిపై చర్చించకుండా సమాధానం చెప్పకుండా నిద్రాణస్థితిలోకి వెళ్లిందని విమర్శించింది.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేలా లేదని, 300 మంది ఎంపీలతో కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు తనకు కనిపించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇటీవలే పేర్కొన్నారు. ఈ కామెంట్లను టీఎంసీ ఉటంకిస్తూ తమ అభిప్రాయాలను గులాం నబీ ఆజాద్ వెల్లడించారని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి మెల్లగా దూరం అవుతూనే ఉన్నదన్న తమ అభిప్రాయాన్ని ఆజాద్ మరోసారి నొక్కి చెప్పారని వివరించింది. 

Also Read: విప‌క్షాల బ‌ల‌హీన‌తే బీజేపీని మ‌ళ్లీ గ‌ద్దెనెక్కించ‌నుందా ?

నేడు దేశానికి ప్రతిపక్షాల ఐక్యత అవసరం అని, విపక్ష పార్టీలను అన్నింటినీ ఒక తాటి మీదకు తెచ్చే బాధ్యతను టీఎంసీ సుప్రీమ్ మమతా బెనర్జీ తీసుకున్నారని వివరించింది. అపోజిషన్‌గా ఆమెకు అధిక పాపులారిటీ ఉన్నదని, ఎక్కువ మంది ఆమోదం కూడా ఆమెకే ఉన్నదని తెలిపింది. అంతేకాదు, బీజేపీపైనా విమర్శలు చేసింది. బీజేపీ మతోన్మాద పార్టీ అని, అప్రజాస్వామిక, ప్రజా వ్యతిరేక, రైత వ్యతిరేక పార్టీ అని విమర్శించింది. ఆ ప్రత్యామ్నాయ ప్రతిపక్ష కూటమి బీజేపీని ఓడించడం ఇప్పుడు అవసరమని వివరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios