Snake bite: లాతూర్ జిల్లా( Maharashtra)లోని అవుసా పట్టణానికి చెందిన అనిల్ తుకారాం గైక్వాడ్‌( 45) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఆయ‌న‌ పొలం పనులకు వెళ్లే క్రమంలో తరచూ పాము కాటుకు గురవుతున్నాడు. ఒకటి, రెండు లేదా మూడు సార్లు కాదు.. గ‌త  15 ఏండ్లలో దాదాపు 500 సార్లు పాముకాటుకు గురయ్యాడు.  

Snake bite: సాధార‌ణంగా గ్రామీణ ప్రాంతాల్లో పొలంలో పనిచేసేట‌ప్పుడో.. అడ‌వి ప్రాంతంలో తిగిరిన‌ప్పుడో అప్పుడప్పుడూ పాముకాటుకు గురవుతుంటారు. అలా జీవితంలో ఒకటి, రెండు లేదా మూడు సార్లు అనుకోని ఘటనలో పాము కాటుకు గురవుతుంటారు. కానీ మహారాష్ట్రకు చెందిన ఓ వ్య‌క్తిని గ‌త 15 ఏండ్లలో దాదాపు 500 సార్లు గురయ్యాడు. ఈ వార్త ఎంతో ఆశ్చ‌ర్యం ఉన్న‌ప్ప‌టికీ ఇది వాస్తవం. 

సినిమా త‌ర‌హా.. సర్ప దోషం.. పాముల పగలు ఇలాంటి కథలు ఎక్కువగా సినిమాలోనే ఉంటాయి. చాలా అరుదుగా నిజజీవితంలో వింటుంటాం.. కారణమేంటో తెలియ‌దు కానీ.. మహారాష్ట్ర‌కు చెందిన వ్య‌క్తి గత 15 ఏళ్లలో దాదాపు ఐదు వందల సార్లు పాము కాటుకు గురయ్యారు. చాలా సార్లు ఐసీయూలో చేరి.. చావు చివ‌రి అంచులు వరకు వెళ్లి వ‌చ్చాడు.

వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలోని అవుసా పట్టణానికి చెందిన అనిల్ తుకారాం గైక్వాడ్‌( 45) వ్యవసాయ కూలి. ఆయ‌న‌ పొలాల్లో కూలి పని చేసే క్రమంలోనే కాకుండా చాలా సార్లు ఆయన పాముకాటుకు గురి అయ్యాడు. ఇలా పాముకాటుకు గురైన ప్రతి సారి ఆయ‌న‌ కుటుంబ సభ్యులు అతడికి వైద్యం చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గత 15ఏళ్లలో దాదాపు 500 సార్లు పాముకాటుకు గురయ్యాడు. . ఈ క్రమంలో అనిల్ అనేక మార్లు ఐసీయూ వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డ ఘటనలూ ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

పొలాల్లోకి వెళ్లినప్పుడే కాకుండా జనసమూహాల్లో ఉన్నపుడు కూడా పాము కాటు కు ఎందుకు గుర‌వుతున్నాడో అర్థం కావడం లేదని వైద్యం చేసిన డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు. సచ్ఛిదానంద్ అనే డాక్టర్ ఇప్పటి వరకు 150సార్లు అనిల్‌కు చికిత్స చేశాడు. కాగా.. ఒకే వ్యక్తి ఇన్నిసార్లు పాముకాటుకు గురికావడం పట్ల డాక్టర్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. దాదాపు అయిదు వందల సార్లు పాము కాటుకు గురైనా ఆయ‌న‌ను ఒకటే పాము క‌రిచిందా? లేక వేరే వేరే పాములు క‌రిచాయా అనేది అనిల్ చెప్ప‌లేక‌పోతున్నాడు

ఈ వార్త చ‌దివగా.. నిజ జీవితంలో పాములు పగబడతాయా? సినిమాల్లో చూపించే విధంగా.. టార్గెట్ చేసి.. చంపేవరకూ వదలవా? సర్ప దోషం వంటి వాస్త‌వ‌మే అనిపిస్తోంది కాదా..! కానీ.. శాస్త్ర‌వేత్త‌లు ఇలాంటి వాదన‌ల‌ను కొట్టిపారేస్తున్నారు.