Asianet News TeluguAsianet News Telugu

Chinese citizen: షాకింగ్..! కాశ్మీర్‌లో పట్టుబడ్డ చైనా పౌరుడి వ‌ద్ద‌ ముంబై ఆధార్ కార్డ్..! గూఢచారని అనుమానం..

Chinese citizen: జమ్మూకశ్మీర్‌లోని గందర్‌బల్ లో చైనా జాతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి భారతీయ ఆధార్ కార్డును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత చైనీస్ వ్యక్తి భారతదేశంలో ఎంతకాలం నివసిస్తున్నాడు? అతనికి ఆధార్ కార్డు ఎక్కడ నుండి వ‌చ్చిందనే దానిపై పోలీసులు ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. 
 

Maharashtra connection of Chinese citizen caught in Kashmir, Aadhar card was made in Mumbai, suspected of being a spy
Author
Hyderabad, First Published May 27, 2022, 4:04 AM IST

Chinese citizen:  కాశ్మీర్‌లోని గందర్‌బల్ ప్రాంతంలో ఓ చైనా పౌరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. షాకింగ్ విషయం ఏంటంటే.. అతడి నుంచి ఆధార్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. చైనా పౌరుడికి భార‌త పౌరుడిగా ఆధార్ కార్డు ఉండ‌ట‌మేమిట‌ని ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ చైనా పౌరుడు ఎప్పటి నుంచి భారత్‌లో ఉంటున్నాడన్న కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. అతనికి భారతదేశపు విశిష్ట గుర్తింపు కార్డు( ఆధార్ కార్డు) ఎలా ల‌భించిందని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అత‌డు చైనా గూఢ‌చారా..?   లేదా చైనా నిఘా అధికారా అనే కోణంలో కూడా పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. 

చైనా పౌరుడిని ప‌రిశీలించ‌గా.. మహారాష్ట్రలోని ముంబైలో తయారు చేసిన ఆధార్ కార్డును ఉన్న‌ట్లు విచారణలో తేలింది. ఆ నిందితుడిని ప్ర‌శ్నించ‌గా.. ముంబై నుంచి ఆధార్ కార్డు తయారు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. చైనా జాతీయుడు లేహ్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాన‌నీ, తాను చైనాలోని గన్సు ప్రాంతంలో నివాసముంటున్నానని, ముంబైలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నానని పోలీసులకు తెలిపాడు. అత‌డు ఆధార్ కార్డును మహారాష్ట్రలో తయారు చేయించిన‌ట్టు తెలిపారు. ముంబై నుంచి విమానంలో లేహ్‌కు వచ్చాన‌నీ, అనంతరం తాను ముంబైకి తిరిగి వెళ్లబోతున్నట్లు విచారణలో పోలీసులకు తెలిపాడు.

పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా విచారిస్తున్నారు. పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. అరెస్టయిన చైనా జాతీయుడు గూఢచారా.. లేదా చైనా అధికారా అనే కోణంలో పోలీసుల విచార‌ణ సాగుతోంది. మరికొంత మందిని కూడా పోలీసులు విచారణకు పిలిచారు. 
   
ఇది త‌రుణంలో ..మొబైల్, వై-ఫై, హాట్‌స్పాట్‌లను దుర్వినియోగం చేసిన కేసులో కొందరు అనుమానితులను పోలీసు స్టేషన్‌కు పిలిచి విచారించామని తెలిపారు. అపరిచిత వ్యక్తులు తమ మొబైల్ హాట్‌స్పాట్‌లను పొరపాటున ఉపయోగించడాన్ని అనుమతించవద్దని పోలీసులు జమ్మూ కాశ్మీర్ పౌరులకు కూడా విజ్ఞప్తి చేశారు. హాట్‌స్పాట్ కూడా బలమైన పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాల‌ని సూచించారు.

జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 ర‌ద్దు తర్వాత పాక్‌, చైనాల మధ్య సంబంధాలు చాలా మెరుగుప‌డ్డాయి.  జమ్మూకశ్మీర్‌లో చొరబాటు ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. పొరుగు దేశాలు ఏమైనా చేసి ఈ ప్రాంతాన్ని అస్థిరపరచాలని భావిస్తున్నాయి. ఈ క్ర‌మంలో జమ్మూ కాశ్మీర్‌లోని పర్యాటక రంగంలో విదేశీ పెట్టుబడులను నిరుత్సాహపరిచేందుకు చైనా అక్కడి ప్రజలను అక్కడికి పంపిస్తోందని, చైనా త‌న‌ ప్రజలను ఇక్కడికి పంపి తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూ అశాంతి వాతావరణాన్ని సృష్టిస్తోందని ఆరోప‌ణ‌లు న్నాయి.

అలాగే.. గత కొద్ది రోజులుగా ఇతర రాష్ట్రాల ప్రజలను, కాశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని కాశ్మీర్ లో హత్యలు చేస్తున్నారు. ఈ విషయంలో పాకిస్థాన్‌కు చైనా సాయం చేస్తున్నట్టు ప‌లు ఆరోప‌ణ‌లున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios