Mumbai: ఒక పోర్న్ వెబ్ సైట్ ఓపెన్ చేసిన ఓ వ్యాపారవేత్త‌ను కేటుగాళ్లు మోస‌గించారు. పోర్న్ సైట్ ఓపెన్ చేయ‌గా.. కంప్యూట‌ర్ స్క్రీన్ పై డ‌బ్బులు చెల్లించాల‌నీ, లేకుంటే అరెస్టు చేస్తామంటూ సందేశం వ‌చ్చింది. ఆ త‌ర్వాత పీసీ మొత్తం బ్లాక్ గా మారిపోయింది.   

Maharashtra: దేశంలో ఇప్ప‌టికే పోర్న్ వెబ్ సైట్లపై నిషేధం కొన‌సాగుతోంది. అయితే, కొత్త‌కొత్త పేర్ల‌తో పోర్న్ సైట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వీటి కార‌ణంగా అనేక ర‌కాలుగా చాలా బాధితులుగా మారుతున్న ప‌రిస్థితులు ఉన్నాయి. ఒక పోర్న్ వెబ్ సైట్ ఓపెన్ చేసిన ఓ వ్యాపారవేత్త‌ను కేటుగాళ్లు మోస‌గించారు. పోర్న్ సైట్ ఓపెన్ చేయ‌గా.. కంప్యూట‌ర్ స్క్రీన్ పై డ‌బ్బులు చెల్లించాల‌నీ, లేకుంటే అరెస్టు చేస్తామంటూ సందేశం వ‌చ్చింది. ఆ త‌ర్వాత పీసీ మొత్తం బ్లాక్ గా మారిపోయింది. బాధితుడు అరెస్టు సందేశం చూసి భ‌య‌ప‌డిపోయి.. వారికి 32 వేల రూపాయ‌ల‌ను చెల్లించాడు. చివ‌ర‌కు తాను మోస‌పోయాన‌ని గ్ర‌హించి పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. 

ఈ ఘ‌ట‌న గురించి పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి..  దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలోని బాంద్రా (వెస్ట్)కు చెందిన 83 ఏళ్ల ఒక‌ వ్యాపారవేత్త పోర్న్ సైట్ ఓపెన్ చేసి.. సెక్స్టార్షన్ ఘటనకు గురై రూ.32,000 చెల్లించాడు. బాంద్రా పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటీవ‌ల బాధితుడు ఒక పోర్న్ సైట్ ను సందర్శించాడు. వెంటనే అతని స్క్రీన్ పై ఒక సందేశం వచ్చింది. తరువాత అతని కంప్యూటర్ బ్లాక్ చేయబడింది. ఆ సందేశంలో 24 గంటల్లోగా రూ.29,000 చెల్లించడంలో విఫలమైతే అరెస్టు చేస్తామని ఆ సందేశంలో పోలీసులు పేర్కొన్న‌ట్టుగా ఉంది. బాంద్రా బాండ్‌స్టాండ్‌లో నివసించే బాధితుడు సంఘటన స్థలాన్ని సందర్శించినప్పుడు అక్టోబర్ 29 మధ్యాహ్నం 12 గంటలకు ఈ సంఘటన జరిగింది.

ఈ క్ర‌మంలోనే బాధితుడు త‌న బ్యాంకు అకౌంట్ స్టేట్ మెంట్ ను తీసుకోవ‌డానికి బ్యాంకు వెళ్లాడు. త‌న అకౌంట్ స్టేట్ మెంట్ చూసిన త‌ర్వాత తాను మోస‌పోయాన‌ని బాధితుడు గ్రహించాడు. ఎందుకంటే త‌న‌ను బెదిరింపుల‌కు గురిచేసే విధంగా సందేశం పంపిన అకౌంట్ నెంబ‌ర్ పోలీసు వారిది కాదు. డబ్బు పోలీసు ఖాతాకు కాకుండా MERD/ PAYU GURGAON/ 3786కు క్రెడిట్ చేయబడిందని గుర్తించాడు. ఈ క్ర‌మంలోనే బాధితుడు పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసుకున్నామ‌ని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేయ‌డానికి సంబంధిత‌ ఖాతాదారుల వివ‌రాల‌ను అందించాల‌ని బ్యాంకును కోరిన‌ట్టు బాంద్రా పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.

త‌న ఫిర్యాదులో వ్యాపారవేత్త‌.. "పోర్న్ సైట్ చూస్తున్నప్పుడు నా కంప్యూటర్ స్క్రీన్ పై పోలీసు మోనోగ్రామ్ తో ఒక సందేశం వచ్చింది. ఆ త‌ర్వాత నా కంప్యూట‌ర్ స్క్రీన్ బ్లాక్ అయిపోయింది. ఆ త‌ర్వాత నేను సందేశంలో వ‌చ్చిన అకౌంట్ కు డ‌బ్బులు చెల్లించాను. ఆ వార్నింగ్ సందేశంలో- పోర్న్ సినిమా చూడటం చట్టవిరుద్ధం. రూ.5 లక్షల వరకు జరిమానా విధించబడుతుంది. మీరు ఒక్క రోజులోగా రూ.29,000 చెల్లించాలి, లేనిపక్షంలో మీరు అరెస్టు చేయబడతారని" వ‌చ్చింది. 'అరెస్టుకు భయపడి నేను వెంటనే నా డెబిట్ కార్డుతో రూ.32,000 ట్రాన్స్ ఫ‌ర్ చేశాను. ఆ తర్వాత నేను మోసపోయానని తెలుసుకున్నాను' అని ఫిర్యాదుదారుడు పోలీసులకు తెలిపాడు.