పార్కులైతే నలుగురు ఉంటారనో లేదంటే.. ఆకతాయిలు వేధిస్తారునుకున్నారో ఏమో ఒక ప్రేమ జంట తమ కామకేళికి పవిత్రమైన దేవాలయాన్ని అడ్డాగా చేసుకుంది. గత కొద్దిరోజులుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని గ్రామస్తులు బట్టబయలు చేశారు.

కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లాలో కళ్లల గ్రామానికి చెందిన యువతీ యువకులు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో సమీపంలో ఉన్న కృష్ణాపుర గ్రామంలోని దేవాలయం మూసి వేసే సమయానికి అక్కడికి చేరుకునేవారు.
రోజూ తమ వూరు మీదుగా వెళ్తుండటంతో ప్రేమికులు ఏకాంతం కోసం అలా వస్తున్నారని మొదట్లో గ్రామస్తులు కూడా పట్టించుకోలేదు. అయితే నిత్యం కనిపిస్తుండటం.. దేవాలయం వైపుగా వెళ్తుండటంతో బుధవారం పలువురు గ్రామస్తులకు అనుమానం వచ్చి వారిని అనుసరించారు.
గుడిలోకి వెళ్లి చూడగా.. అప్పటికే వారు కామకలాపాల్లో మునిగి ఉన్నారు. గ్రామస్తులు అనుసరిస్తున్న సంగతిని కూడా వారు పట్టించుకోలేనంతగా శృంగారంలో మునిగిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఎవరో ఇటువైపు వస్తున్నారని గమనించి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే గ్రామస్తులు ప్రేమజంటను పట్టుకుని మరోవైపు ఇలాంటి పనులు చేయవద్దని గట్టిగా హెచ్చరించారు. వారిలో కొందరు ఈ వ్యవహారాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.