Asianet News TeluguAsianet News Telugu

#Verdict with Asinetnews: తేజస్వికి గిఫ్ట్ అంటూ లాలూ వ్యాఖ్య

ఆర్జెడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం రాంచీలో జైలు జీవితం అనుభవిస్తున్నారు. తన కుమారుడు తేజస్వి యాదవ్ కు బీహార్ ప్రజలు పుట్టిన తేదీ బహుమతి ఇస్తారని లాలూ అన్నారు.

Lalu Prasad Yadav syas Bihar will give Tejashwi yadav gift
Author
Patna, First Published Nov 10, 2020, 8:26 AM IST

న్యూఢిల్లీ: బీహార్ తన కుమారుడికి 31వ పుట్టిన తేదీ బహుమతిని ఇస్తుందని తేజస్వీ యాదవ్ తండ్రి, ఆర్జెడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. దాణా కేసుల్లో ఆయన ప్రస్తుతం రాంచీలో జైలు జీవితం అనుభవిస్తున్నారు. మంగళవారంనాడు తేజస్వి యాదవ్ కు బీహార్ పుట్టిన తేదీ బహుమతిని ఇస్తుదని అన్నారు. 

తేజస్వీ యాదవ్ గత అర్థరాత్రి రెండు మూడుసార్లు లాలూ యాదవ్ హెల్పర్ నెంబర్ కు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. తన తండ్రిని లాలూతో మాట్లాడడానికి ఆయన ప్రయత్నించినట్లు సమాచారం. అయితే, లాలూ యాదవ్ నిద్రపోతున్నట్లు తెలిసింది. చివరకు లాలూ యాదవ్ ఆయనకు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం.

మూడు దశల్లో జరిగిన బీహార్ ఎన్నికలు ముగిసాయి. 243 అసెంబ్లీ సీట్లకు గాను జరిగిన పోలింగ్ తాలూకు కౌంటింగ్ ఆరంభమయింది. ఒపీనియన్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీయే కూటమి విజయభేరి మోగిస్తాయని చెప్పగా.... నాలుగు వారల గ్యాప్ తరువాత నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం అందుకు భిన్నంగా మహాఘట్ బంధన్ కి స్వల్ప ఆధిక్యతను అందిస్తూ విజయావకాశాలు ఉన్నాయంటూ పేర్కొన్నారు. 

నిన్ననే 31వ జన్మదినం జరుపుకున్న తేజశ్వి లాలూ వారసత్వాన్ని కొనసాగిస్తాడా... లేదా మరోమారు నితీష్ కుమార్ బీహార్ సీఎం అవుతారా అనేది తేలనుంది. 
నేటి ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభమయింది. కౌంటింగ్ కి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల కమిషన్ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూర్తిస్థాయిలో సమగ్ర ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన భద్రత కోసం భారీ స్థాయిలో బలగాలను మోహరించింది. 

ఓట్ల లెక్కింపు కోసం బీహార్ వ్యాప్తంగా 38 జిల్లాల్లో 55 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసారు.  తూర్పు చంపారన్‌, గయ, సివాన్, బెగుసరాయ్ జిల్లాల్లో మూడేసి చొప్పున కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసారు. కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రతను  ఏర్పాట్లు చేశారు.

మొదటి అంచెలో సీఐఎస్ఎఫ్, రెండవ అంచెలో బీహార్ మిలటరీ పోలీసులు, మూడవ అంచెలో జిల్లా పోలీసులను మోహరించింది ఎన్నికల సంఘం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 38 స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సైతం ఇదే భద్రతను ఉంచారు. సిఐఎస్ఎఫ్  సిబ్బంది నిరంతర కాపలాతో పాటు వీడియో కెమెరాలతో నిత్యం డేగకన్నుతో పహారా కాస్తున్నారు. 
 మొత్తం 55 కౌంటింగ్ కేంద్రాల్లో 1,06,524 ఈవీఎంలను లెక్కించనున్నారు. 370 మంది మహిళా అభ్యర్థులతో సహా 3,588 మంది మంది అభ్యర్థుల భవితవ్యాలు ఇప్పటికే వాటిలో నిక్షిప్తమయ్యాయి. 

కౌంటింగ్ ప్రారంభం నుంచి పూర్తయ్యేంత వరకూ  పూర్తిగా వీడియో రికార్డింగ్ ను చేయనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో 57.05 పోలింగ్ శాతం నమోదైంది. కరోనా మహమ్మారి  ప్రబలంగా వ్యాపిస్తున్నప్పటికీ.... 2015తో పోల్చుకుంటే పోలింగ్ శాతం ఒకింత ఎక్కువగా నమోదవడం ఆశ్చర్యకరం.

Follow Us:
Download App:
  • android
  • ios