తాను ప్రాణాలతో పోరాడుతూనే ఐదుగురిని కాపాడింది పూజా యాదవ్‌. కానీ  తనను తాను రక్షించుకోలేకపోయింది. ఖుషీనగర్ ప్రమాదంలో మరణించిన 13 మందిలో 21 ఏళ్ల పూజా యాదవ్ కూడా ఉన్నారు. 

 ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌ జిల్లాలో బుధవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగిన వేడుకల్లో దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఈ ప్రమాదంలో.. ఓ యువతి ఐదుగురి ప్రాణాలు కాపాడి.. చివరకు తన ప్రాణాలు కోల్పోయింది.

తాను ప్రాణాలతో పోరాడుతూనే ఐదుగురిని కాపాడింది పూజా యాదవ్‌. కానీ తనను తాను రక్షించుకోలేకపోయింది. ఖుషీనగర్ ప్రమాదంలో మరణించిన 13 మందిలో 21 ఏళ్ల పూజా యాదవ్ కూడా ఉన్నారు. 

అయితే రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో ఆమె చూపిన ధైర్యమే సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆమె ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు సిద్ధమైంది. అందులో ఎంపిక కావడానికి ముందే జీవిత యుద్ధంలో ఓడిపోయింది. ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలు ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురి ప్రాణాలను కాపాడాయి. పూజా యాదవ్ తండ్రి బల్వంత్ యాదవ్ ఆర్మీలో ఉన్నారు. కూతురికి ఘనంగా పెళ్లి చేయాలి అనుకునేవాడు. కానీ ఆమె మాత్రం తండ్రిలాగే ఆర్మీలో సేవలు అందించాలని అనుకుంది. చివరకు ఐదుగురి ప్రాణాలు కాపాడి తాను వీర మరణం పొందింది.

ప్రమాదం జరిగినప్పుడు చీకటి పడింది. పూజతో మునిగిపోయిన వారిలో ఆమె తల్లి కూడా ఉన్నారు. ఆమె తన తల్లితో పాటు.. ఐదుగురిని కాపాడింది. ఆరవ వ్యక్తిని కాపాడే క్రమంలో ఆమె నీటిలో మునిగిపోయింది.

ప్రతి ఒక్కరూ పూజ నుండి సహాయం కోసం వేడుకున్నారు
ప్రమాద సమయంలో అక్కడ ఉన్నవారు మాట్లాడుతూ పూజ అందరినీ కాపాడుతుందనే అనుకున్నారట. ఆమె ఉత్సాహాన్ని చూసి జనం ఏడుస్తూ అందరినీ కాపాడాలంటూ పూజ పేరు చెప్పారట. ప్రతి ఒక్కరూ పూజ నుండి సహాయం కోసం వేడుకున్నారు. ఆమె 5 మందిని రక్షించడంతో, ప్రజల ఆశలు చిగురించాయి. అయితే.. పూజా ఆరో వ్యక్తి ప్రాణాన్ని కాపాడుతుండగా బ్యాలెన్స్ తప్పి నీటిలో పడింది.


పూజ బీఏ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని
పూజ తహసీల్దార్ షాహీ మహావిద్యాలయ సిన్హాలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. ఆమెకు ఇద్దరు కవల సోదరులు ఆదిత్య , ఉత్కర్ష్ ఉన్నారు. తండ్రి బల్వంత్ యాదవ్ ఢిల్లీలో పోస్ట్ చేయగా, కవల సోదరుడు తొమ్మిదో తరగతి చదువుతున్నారు.