వ్యవసాయాన్ని టెక్నాలజీ జోడిస్తే ఇక అద్భుతాలే ... యోగి సర్కార్ సరికొత్త ఆలోచన

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నవంబర్ 15 నుండి 18 వరకు 'కృషి భారత్ మేళా' నిర్వహించనున్నారు. ఈ మేళాలో 200 కి పైగా ప్రదర్శకులు, లక్షకు పైగా రైతులు పాల్గొంటారు. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం.

Krishi Bharat Mela in Lucknow: Showcasing Agricultural Innovations in November  AKP

లక్నో : సెప్టెంబర్ 25న (బుధవారం)  గ్రేటర్ నోయిడాలో యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో ప్రారంభమయ్యింది. ఇలాంటి కార్యక్రమాలను మరెన్నో నిర్వహించేందుకు యోగి సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే నవంబర్ లో  "కృషి భారత్ మేళా" నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నవంబర్ 15 నుండి 18 వరకు రాష్ట్ర రాజధాని లక్నోలో జరగనున్న ఈ మేళా ద్వారా రాష్ట్రంలోని వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించనున్నారు. అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన మాదిరిగానే ఈ కార్యక్రమంలో భాగస్వామ్య దేశంగా నెదర్లాండ్స్‌ వ్యవహరించనుంది. 

ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం, ''కృషి భారత్ మేళా'' 20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్వహించబడుతుంది. ఇందులో 200 కంటే ఎక్కువ మంది ప్రదర్శకులు పాల్గొనే అవకాశం ఉంది. అలాగే లక్షకు పైగా మంది అన్నదాతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా 10 కి పైగా సదస్సులు నిర్వహించనుండగా, 4000 కంటే ఎక్కువ మంది వ్యవసాయ ఆధారిత వ్యాపారాలకు చెందినవారు హాజరవుతారు. ఎనిమిది రాష్ట్రాల రైతులకు కూడా ఇందులో పాల్గొనే అవకాశం లభిస్తుంది.

ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు, అన్నదాతలు వాటితో ముందుకు సాగడానికి వేదిక కల్పిస్తారు. ఈ ఆవిష్కరణలను ప్రదర్శించడానికి ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. వీటిలో వ్యవసాయ పర్యాటకం, స్థిరత్వం జోన్, రైతు సంక్షేమ జోన్, యువ రైతుల జోన్‌లు ఉంటాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios