చంఢీఘడ్: హర్యానాలోని కర్నాల్ లో ఆదివారం నాడు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకొంది. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు.

కర్నాల్ లో సీఎం కట్టర్ నేతృత్వంలో మహా పంచాయత్ సభను నిర్వహించాలని తలపెట్టారు. అయితే ఈ సభ ప్రారంభానికి ముందే పెద్ద ఎత్తున రైతులు ఈ ప్రాంతానికి చేరుకొని నిరసనకు దిగారు.

సీఎం ఈ ప్రాంతానికి వచ్చేందుకు వీలుగా హెలిపాడ్ ను అధికారులు సిద్దం చేశారు. హెలిపాడ్ ను ధ్వంసం చేసేందుకు రైతులు ప్రయత్నించారు. ఈ సమయంలో రైతులను పోలీసులు అడ్డుకొన్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకొంది.

రైతులపై పోలీసులు లాఠీఛార్జీకి దిగారు. అయనా కూడ వారు తగ్గలేదు. దీంతో పోలీసుు టియర్ గ్యాస్ ప్రయోగించారు. నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతుగా మహాపంచాయిత్ సభను చేపట్టాలని సీఎం ఖట్టర్ పూనుకొన్నారు.

ఈ ప్రాంతానికి ఇతర ప్రాంతాల నుండి రైతులు రాకుండా పోలీసులు అడ్డుకొన్నారు. నల్లజెండాలతో రైతులు బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత వారంలో ఇదే రాష్ట్రంలోని రేవారి జిల్లాలో చోటు చేసుకొంది., 

మహా పంచాయిత్ సభను నిలిపివేయాలని కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా  ట్విట్టర్ వేదికగా కోరారు.