న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోసం తన కూతురు ప్రచారం మొదలుపెట్టింది. ఎన్నికలకు ఇంకా రెండు నుంచి మూడు నెలల సమయం ఉన్నప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ కూతురు మాత్రం నాన్న కోసం ప్రచారం మొదలుపెట్టేసింది. 

కేజ్రీవాల్ కూతురు హర్షిత కేజ్రీవాల్ ఒక ఎమ్మెన్సీ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తుంది. చిందుల్లో మంచి ప్రతిభాశాలి. ఇంజనీరింగ్ ను ఐఐటీ ఢిల్లీ నుంచి పూర్తి చేసింది. కెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయినా హర్షిత ఇప్పుడు నాన్నను మరోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కించేందుకు 5నెలల సెలవు పెట్టిమరీ ప్రచారంలోకి దిగుతుంది. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే జనుఅరీ లేదా ఫిబ్రవరి లో జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటి నుంచే ప్రచారంలో జోరు ప్రదర్శిస్తే ఇతరపార్టీల కన్నా ముందుండొచ్చు కదా అని ఆప్ శ్రేణులు భావిస్తున్నారు. చీపిరి కట్టతో సాఫ్, సఫాయి చేస్తూ మొహల్లాల్లో డెంగీ ని ఓడించామంటూ, రెండు సంవత్సరాల్లోనే ఈ మహమ్మారిని జయించామని చెబుతున్నారు.