వేర్పాటువాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పడం లేదని ఆ పార్టీ మాజీ నేత కుమార్ విశ్వాస్ అన్నారు. అలా చెబితే ఆయనపై పెట్టుబడి పెట్టిన వారు అసంతృప్తికి గురవుతారని ఆరోపించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal)కు వేర్పాటువాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఇటీవల ఆరోపణలు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (aam admi party) మాజీ నేత, కవి కుమార్ విశ్వాస్ (kumar vishwas) శనివారం మళ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఖలిస్తానీలను వ్యతిరేకిస్తానని ఇప్పటికీ చెప్పలేదని.. ఎందుకంటే ఆయనపై పెట్టుబడులు పెట్టిన వారు అసంతృప్తికి చెందుతారని తెలిపారు.
‘‘అరవింద్ కేజ్రీవాల్ ఖలిస్తానీలను వ్యతిరేకిస్తానని చెప్పడం లేదు. ఎందుకంటే ఆయన అలా చేస్తే, అతనిపై పెట్టుబడి పెట్టిన వ్యక్తులు సంతోషంగా ఉండరు. నేను కోపంలో చెప్పిన మాటకు ఆయన రియాక్షన్ ఇచ్చిన తీరే తెలుపుతోందని నేను చెప్పింది నిజమని నిరూపిస్తోంది. నేను పార్టీకి రాజీనామా చేయలేదు. నన్ను తొలగించే సామర్థ్యం ఆయనకు లేదు ’’ అని విశ్వాస్ తెలిపారు.
ఈ వారం ప్రారంభంలో కుమార్ విశ్వాస్. ఆరవింద్ కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారని, లేదా స్వతంత్ర ఖలిస్తాన్ దేశానికి మొదటి ప్రధానమంత్రిని కావాలనుకుంటున్నారని తనతో ఆయన చెప్పారని విశ్వాస్ అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రికి పంజాబ్‌లోని వేర్పాటువాదులతో సంబంధాలు ఉన్నాయని అన్నారు.వేర్పాటువాదులతో సానుభూతి ఉన్నవారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమావేశాలకు ఆయన ఇంటికి వచ్చేవారని ఆరోపించారు. ఈ ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.
ఈ వ్యాఖ్యలపై AAP కుమార్ విశ్వాస్ పై విరుచుకుపడింది. ఈ ఆరోపణలు తనకు నవ్వు తెప్పించాయని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తాను స్వీట్ తీవ్రవాదనని అన్నారు. ఉచిత హాస్పిటల్స్, స్కూల్స్, కరెంటు అందించిన స్వీట్ తీవ్రవాదనని చెప్పుకొచ్చారు. బహుశా ప్రపంచంలో తాను ఒక్కడినే ఇలాంటి తీవ్రవాదిని కావొచ్చని తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టారు.
ఇదిలా ఉండగా.. కుమార్ విశ్వాస్ చేసిన ఆరోపణ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ పై చర్యలు తీసుకోవాలని పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ (charanjith singh) కేంద్ర హోం మంత్రి అమిత్ షా (cental home minister amith shah) కు గతంలోనే లేఖ రాశారు. దీనికి అమిత్ షా శుక్రవారం సమాధానం ఇచ్చారు. భారత దేశ ఐక్యత, సమగ్రతతో ఆడుకోవడానికి ఎవరికీ అనుమతి లేదని ఆలయన అన్నారు. నిషేధించిన వేర్పాటువాద సంస్థ సిక్కు ఫర్ జస్టిస్ ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని చెప్పారు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కొందరు వ్యక్తులు వేర్పాటువాదులతో చేతులు కలపడంతో పాటు పంజాబ్‌ను, దేశాన్ని విచ్ఛిన్నం చేసే స్థాయికి వెళ్లడం అత్యంత ఖండనీయమని కూడా హోంమంత్రి అన్నారు.
కాగా.. అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్ర ఆరోపణలు చేసిన కుమార్ విశ్వాస్ కు కేంద్ర ప్రభుత్వం 'వై' కేటగిరీ వీఐపీ భద్రతను కల్పించినట్లు ప్రభుత్వ వర్గాలు వివరాలు వెల్లడించాయి. అయితే ఈ విషయం తనకు తెలియదని విశ్వాస్ తెలిపారు. “ నేను వై కేటగిరీ భద్రతను అడగలేదు. కోరుకోలేదు. భద్రత విషయంలో అధికారుల నుంచి నాకు ఎలాంటి సందేశం రాలేదు. తమ పౌరుల భద్రత గురించి ఆలోచించడం ఏజెన్సీలు, ప్రభుత్వాల పని. ఆయన(కేజ్రీవాల్) తో మాట్లాడటం నా పని కాదు.’’ అని ఆయన చెప్పారు.
