కర్ణాటక మాజీ మంత్రి రమేష్ కి సంబంధించిన రాసలీలల వీడియో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  కాగా.. ఈ వీడియో బయటకు రాగానే... అప్పుడు పదవిలో ఉన్న మంత్రిని.. ఆ పదవి నుంచి తొలగించారు. 

కర్ణాటక మాజీ మంత్రి రాసలీల కేసు మరో మలుపు తిరిగింది. గత కొద్ది రోజుల క్రితం  కర్ణాటక మాజీ మంత్రి రమేష్ కి సంబంధించిన రాసలీలల వీడియో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  కాగా.. ఈ వీడియో బయటకు రాగానే... అప్పుడు పదవిలో ఉన్న మంత్రిని.. ఆ పదవి నుంచి తొలగించారు. తర్వాత చాలా చాలా విషయాలే జరిగాయి. తాజాగా.. ఈ కేసుకు సంబంధించిన యువతి కనిపించడం లేదంటూ.. ఆమె తండ్రి కేసు పెట్టాడు.

ధార్వాడ హైకోర్టు బెంచ్‌లో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సీడీ కేసు వెలుగులోకి వచ్చాక తన కుమార్తె కొన్ని నెలలుగా కనిపించలేదని, ఆమె ఎక్కడ ఉందో తెలియదని, ఆమె ఆచూకీ తెలియజేయాలని కోర్టును అభ్యర్థించాడు. ఈ మేరకు యువతి తండ్రి ప్రకాశ్‌ వేసిన రిట్‌ను సోమవారం హైకోర్టు విచారణకు స్వీకరించింది.కాగా.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె సడెన్ గా కనిపించకుండా ఎక్కడికి పోయిందనే విషయం స్థానికంగా కలకలం రేపుతోంది.