కర్ణాటక రాష్ట్రంలో విద్యా సంస్థల్లో హిజాబ్ వివాదం తెర మీదికి రావడంతో తమిళనాడు సహా ఇతర రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఎంఎన్ఎం నేత కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు.

చెన్నై: కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదంపై సినీ నటుడు,MNM నేత కమల్ హాసన్ బుధవారం నాడు స్పందించారు. ట్విట్టర్ వేదికగా కమల్ హాసన్ తన అభిప్రాయాలను వెల్లడించారు.అమాయక విద్యార్ధుల మధ్య మతపరమైన విభజనకు హిజాబ్ వివాదం కారణంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.కర్ణాటకలో జరుగుతున్న ఈ వివాదం అమాయక విద్యార్ధుల మధ్య మత విభజనను సృష్టిస్తోందని మక్కల్ నీది మయ్యం చీఫ్ Kamal Haasan అభిప్రాయపడ్డారు.

ఇలాంటి సమయంలో తమిళనాడు మరింత జాగ్రత్తగా ఉండాలని కమల్ హాసన్ సూచించారు. పొరుగు రాష్ట్రమైన Karnataka లో జరుగుతున్న పరిణామాలు Tamilnadu రాష్ట్రంలో జరగకూడదని కోరుకొంటున్నట్టుగా కమల్ హాసన్ చెప్పారు. అయితే రాష్ట్రంలోని అభ్యుదయ శక్తులు మరింత జాగ్రత్తగా ఉండాలని కమల్ హాసన్ సూచించారు.

Scroll to load tweet…

· 2h கர்நாடகாவில் நடப்பது கலக்கத்தைத் தூண்டுகிறது. கள்ளமில்லா மாணவர்கள் மத்தியில் மதவாத விஷச் சுவர் எழுப்பப்படுகிறது. ஒற்றைச் சுவர் தாண்டியிருக்கும் பக்கத்து மாநிலத்தில் நடப்பது தமிழ்நாட்டுக்கும் வந்துவிடக் கூடாது. முற்போக்கு சக்திகள் மேலும் கவனமாக இருக்க வேண்டிய காலம் இது.

హిజాబ్ వివాదం తీవ్రం కావడంతో కర్ణాటకలో మూడు రోజుల పాటు విద్యా సంస్థలను మూసివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం తీసుకొన్న మరునాడే కమల్ హాసన్ ట్విట్టర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ వివాదంనై కర్ణాటక హైకోర్టులో బుధవారం నాడు విచారణ జరగనుంది. 

గ‌త‌నెల‌లోUdupiలోని ప్రభుత్వ college లో ఈ వివాదం ప్రారంభ‌మైంది. ఆరుగురు విద్యార్థినీలు నిర్దేశించిన దుస్తుల కోడ్‌ను ఉల్లంఘించి Hijabలు ధరించి తరగతులకు వచ్చారు. తర్వాత నగరంలోని మరికొన్ని కళాశాలల్లో సమీపంలోని కుందాపూర్, బిందూర్‌లలో కూడా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. ఈ ఆంశానికి వ్య‌తిరేకంగా ఓ వర్గం విద్యార్థులు కాషాయ కండువాలు ధ‌రించి క‌ళాశాల‌కు ప్ర‌వేశించారు. తాము కండువా ధరించి వ‌స్తామ‌నీ తెలిపారు. కానీ వ్య‌తిరేకించ‌డంతో తమను తరగతుల నుండి నిషేధించారని ఆరోపించడంతో నిరసనలు ప్రారంభించారు. ఉడిపి, చిక్ మంగళూరులోని రైట్‌వింగ్ గ్రూపులు ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకించాయి. ఈ నిరసనలు ఉడిపిలో ఉన్న మరిన్ని కళాశాలలకు వ్యాపించాయి.

ఈ క్ర‌మంలో ఫిబ్రవరి 8 ఉడిపిలోని ఒక ప్రభుత్వ కళాశాలలో ఇన్‌స్టిట్యూట్‌లో హిజాబ్‌ను నిషేధించిన ఉత్తర్వులను సవాలు చేస్తూ High Courtలో పిటిష‌న్ దాఖాలు చేశారు. ఈ పిటిషన్‌లను కర్ణాటక హైకోర్టు విచారించనుంది. స్కూల్ అడ్మినిస్ట్రేషన్ డిక్రీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ను ఉల్లంఘించడమేనని దాని ప్రకారం మత స్వేచ్ఛ ఉందని విద్యార్థి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.