కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మంగళవారం తన కేబినెట్‌ను విస్తరించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 17 మందితో మంత్రిమండలిని ఏర్పరిచారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రులతో గవర్నర్ వాజూభాయ్ వాలా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు హాజరయ్యారు. 

యడియూరప్ప కేబినెట్‌లో మంత్రులు వీరే:

1. గోవింద్ మక్తప్ప
2. అశ్వత్ నారాయణ
3. లక్ష్మణ్ సంగప్ప
4. ఈశ్వరప్ప
5. అశోక
6. జగదీష్
7. శ్రీరాములు
8. ఎస్.సురేశ్ కుమార్
9. వి.సోమన్న
10. సి.టి.రవి
11. బసవరాజు
12.  శ్రీనివాస్ పూజారి
13. జేసీ మధుస్వామి
14. చిన్నప్పగౌడ పాటిల్
15. హెచ్.నగేశ్
16. ప్రభు చౌహాన్