ప్రధాని నరేంద్రమోడీని ఎలాగైనా అధికారానికి దూరం చేయాలని భావించిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. మే 23న బీజేపీయేతర పార్టీల సమావేశానికి రాలేనంటూ స్టాలిన్ పెద్ద షాక్ ఇచ్చిన నేపథ్యంలో... జేడీఎస్ నేత, కర్ణాటక సీఎం కుమారస్వామి సైతం అదే దారిలో నడుస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఎన్నికల సంఘం పనితీరును నిరసిస్తూ మంగళవారం చంద్రబాబు నేతృత్వంలో ఢిల్లీలో జరగనున్న ఆందోళనకు కుమారస్వామి దూరం జరిగారు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు మారడంతో కుమారస్వామి తటస్థంగా వుండాలని భావించినట్లుగా తెలుస్తోంది.

దీంతో ఇవాళ్టీ ఢిల్లీ పర్యటనను కర్ణాటక ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నారు. 23వ తేదీ సమావేశానికి ఇప్పటికే మమత బెనర్జీ నో చెప్పిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు కూటమి కల నెరవేరుతుందా లేదా అంటూ పెద్ద చర్చ నడుస్తోంది.