కర్ణాటక, బెళగావి జిల్లాలోని గోకాక్ తాలూకాలో సామూహిక అత్యాచార ఘటన జరిగింది. దీనిమీద ఫిర్యాదు అందిన పదిగంటల్లోనే పోలీసులు కామాంధుల్ని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెడితే...
కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ బాలిక మీద సామూహిక అత్యాచారం చేశారు ఐదుగురు కీచకులు. ఇంతటితో ఆగకుండా ఆ తరువాత ఆమెను బెదిరిస్తూ అనేక మార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది.
కర్ణాటక, బెళగావి జిల్లాలోని గోకాక్ తాలూకాలో సామూహిక అత్యాచార ఘటన జరిగింది. దీనిమీద ఫిర్యాదు అందిన పదిగంటల్లోనే పోలీసులు కామాంధుల్ని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెడితే...
మహిళలు, యువతులు, చిన్నారులు, వృద్ధులనే బేధం లేకుండా ఆడది కనిపిస్తే చాలు అత్యాచారాలకు పాల్పడడం మామూలైపోయింది. అత్యాచారం చేసిన తరువాత వారి బలహీనలతను ఆదారంగా చేసుకుని.. బెదిరింపులకు పాల్పడడం, వేధించడం లేదంటే చంపేయడం ఇటీవలి కాలంలో మితిమీరిపోతున్నాయి. అలాంటిదే ఈ ఘటన కూడా..
కర్ణాటక గోకాక్ తాలూకాలోని ఘటప్రభా పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 20 రోజుల క్రితం 16యేళ్ల బాలిక మీద ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ తరువాత ఈ విషయం తెలిసినా.. తల్లిదండ్రులు లోపల్లోపలే కుమిలిపోయారు తప్ప బైటికి చెప్పలేదు. పరువు పోతుందన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు.
ఇది ఆ కామాంధులకు అలుసుగా దొరికింది. అంతే బాధితురాలిని బెదిరిస్తూ.. పదే పదే పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. దీంతోపాటు రోజురోజుకూ ఈ వేధింపులు, బెదిరింపులు ఎక్కువవుతుండడంతో పోలీసుల్ని ఆశ్రయించారు బాధితురాలి తల్లిదండ్రులు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
