సీనియర్ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ రచించిన ‘‘ నేతా- అభినేతా: బాలీవుడ్ స్టార్ పవర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్‌’’ పుస్తకం సంచలనాలకు వేదికవుతోంది. 

సీనియర్ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ రచించిన ‘‘ నేతా- అభినేతా: బాలీవుడ్ స్టార్ పవర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్‌’’ పుస్తకం సంచలనాలకు వేదికవుతోంది. కెరీర్‌లో ఎంతో మందిని ప్రేమించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌ ఒకానొక దశలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఇష్టపడినట్లుగా ఆయన ఒక కథనం రాశారు.

కపూర్ కుటుంబంతో నెహ్రూ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉండటంతో 2002 సమయంలో కరీనా... రాహుల్‌ను తెగ ఇష్టపడిందట..కుదిరితే రాహుల్‌తో డేట్‌కు వెళ్లాలని అనుకుందట... అంతేకాకుండా కరీనా నటించిన ఏ సినిమాను అయినా కాంగ్రెస్ అధ్యక్షుడు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేవారట.

ఇదే సమయంలో ఓ టీవీ షోకు హాజరైన కరీనా... రాహుల్‌తో డేట్‌కు వెళ్లడాన్ని ఇష్టపడతానని చెప్పిన సంగతిని రషీద్ తన పుస్తకంలో పొందుపరిచారు. హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే కరీనా... సైఫ్ అలీఖాన్‌ను పెళ్లాడటం.. ఈ దంపతులకు తైమూర్ అనే బాబు పుట్టిన సంగతి తెలిసిందే.