Asianet News TeluguAsianet News Telugu

ఏడాదిన్నరగా ఇంట్లోనే శ‌వం.. కోమాలో ఉన్నాడని ప్ర‌చారం.. అస‌లు ఎలా ఉన్నారా.. బాబూ..   

ఏడాదిన్నర పాటు  మరణించిన ఓ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు చేపట్టకుండా ఇంట్లోనే పెట్టుకుంది.  విషయం తెలుసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో రావత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగింది.
 

Kanpur Family keeps mans body in house for 18 months believing him
Author
First Published Sep 23, 2022, 11:19 PM IST

రానురాను మ‌నుషుల మ‌ధ్య దూరం పెరిగిపోతుంది. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో పని ఒత్తిడితో  త‌న‌ని తాను పాటించుకోవ‌డానికే స‌మ‌యంలో దొర‌క‌డం లేదు. పైగా న‌గ‌రాల్లో వ‌చ్చిన  అపార్ట్ మెంట్ కల్చర్.. మనిషి.. మనిషికి మ‌రింత దూరాన్ని పెంచింది.  పక్కింట్లో ఎవరుంటున్నారు? ఏం చేస్తుంటారు ? ఏం తెలుసుకోలేని ప‌రిస్థితి.. అంతగా మానవ సంబంధాలు దెబ్బ తింటున్నాయి. ప్ర‌స్తుత విష‌యం వింటే  మాత్రం ఒళ్లు గగుర్పాటుకు గుర‌వుతుంది. సభ్య సమాజం తీరుపట్ల భయం క‌లుగుతుంది. ఓ షాకింగ్ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో వెలుగులోకి వ‌చ్చింది. 

అసలేం జరిగిందంటే.. ఉత్తర్​ప్రదేశ్​లో ఏడాదిన్నర క్రితం ఓ వ్య‌క్తి  చ‌నిపోయాడు. కానీ, అత‌ని త‌ల్లిదండ్రులు మృత‌దేహానికి అంత్యక్రియలు నిర్వ‌హించ‌కుండా దాదాపు  ఇంట్లోనే ఉంచుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ ఇంటికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.  

వివరాల్లోకెళ్తే.. కాన్పూర్‌లోని రావత్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణపురి రోషన్ నగర్‌లో రామ్ ఔటర్ అనే వ్య‌క్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అత‌నికి ముగ్గురు కుమారులు. వారిలో చిన్నవాడు విమలేష్ (35) అహ్మదాబాద్‌లోని ఆదాయపు పన్ను శాఖలో అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్ (ఏఏవో) గా ప‌నిచేస్తున్నాడు.  విమలేష్ భార్య మితాలీ కిద్వాయ్‌నగర్‌లోని ఓ కోఆపరేటివ్ బ్యాంక్‌లో పని చేస్తోంది. ఆయ‌న‌కు క‌రోనా సోక‌డంతో చికిత్స పొందుతూ..  2021 ఏప్రిల్​ 22న మరణించాడు. 

అయితే.. కోవిడ్ నిబంధనలను పట్టించుకోకుండా ఆసుపత్రి యాజమాన్యం విమలేష్ మృతదేహాన్ని మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు బంధువులకు అప్పగించింది. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా.. విమలేష్ గుండె చప్పుడు వస్తోందని తల్లి రామ్ దులారి అంత్యక్రియలు చేసేందుకు నిరాకరించారు. 

అప్పటి నుంచి .. అత‌ని మృత‌దేహానికి వారు  అంత్యక్రియ‌లు నిర్వ‌హించ‌కుండా.. మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచారు. అతడు కోమాలో ఉన్నాడని అందరికీ చెబుతూ మృతదేహాన్ని ఇంట్లోనే భ‌ద్ర‌ప‌రిచారు కుటుంబ స‌భ్యులు. ఇంట్లోకి ఎవ‌రిని రానివ్వ‌కుండా..  ఈ విష‌యాన్ని బ‌య‌ట ఎవ‌రికి చెప్ప‌కుండా దాదాపు 18 నెల‌ల పాటు ర‌హ‌స్యంగా ఉంచారు. విమలేష్ భార్య మితాలీతో పాటు విమలేష్ సోదరులు సునీల్, దినేష్ కుటుంబం కూడా అదే ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. 

అయితే ఇటీవ‌ల‌ విమలేశ్​ భార్య మిథాలీ పెన్షన్​ దరఖాస్తు చేయడానికి అత‌ని మరణ ధ్రువీకరణ పత్రాన్ని సంబంధిత శాఖ‌కు సమర్పించింది. ఈ క్ర‌మంలో ఆమె డిపార్ట్‌మెంట్‌కు ఫోన్ చేసి తన భర్త చనిపోయాడని, అయినప్పటికీ ఆమె తల్లిదండ్రులు ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుతున్నారని చెప్పింది.  దీంతో అస‌లు విషయం బయటపడింది. ఆదాయ పన్నుశాఖ.. సీఎంవోకు ఈ విషయాన్ని తెలియజేసింది. సీఎంవో వెంటనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు ఆదేశించింది.

సమచారం అందుకున్న పోలీసులు.. వెంటనే విమలేశ్​ ఇంటికి చేరుకున్నారు. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి బంధువులు నిరాకరించారు. ఆయన బతికే ఉన్నారని కుటుంబసభ్యులు అండగా నిలుస్తున్నారు. దీనిపై వైద్యబృందం వైద్య కళాశాలకు సంబంధించి హలత్ ఆసుపత్రికి పంపారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. విమలేశ్​ మృతదేహం పూర్తిగా చెడిపోయిందని, ఎముకల్లో మాంసం కూడా ఎండిపోయిందని వైద్యులు చెబుతున్నారు.  తెలిపారు. అయితే ఏడాదిన్నరగా శ‌వాన్ని ఇంట్లో ఉంచుకుని ఎలా ఉన్నార‌ని స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios