దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి స్పందించారు. ముఖ్యంగా ఎన్నికల్లో విజయం కోసం మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ పోరాట పటిమను ప్రశంసిస్తూనే, తేజస్వి మంచి కుర్రాడని కితాబిచ్చారు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి స్పందించారు. ముఖ్యంగా ఎన్నికల్లో విజయం కోసం మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ పోరాట పటిమను ప్రశంసిస్తూనే, తేజస్వి మంచి కుర్రాడని కితాబిచ్చారు.
కమల్‌నాథ్ తన ప్రభుత్వాన్ని బాగా నడిపి ఉంటే ఎలాంటి సమస్య వచ్చి ఉండేది కాదని ఉమా భారతి అభిప్రాయపడ్డారు. ఆయన చక్కటి సభ్యత కలిగిన వ్యక్తని, తన సోదరుడు లాంటి వాడని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ఆయన చాలా చాకచక్యంగా పోరాడారని ఉమాభారతి పేర్కొన్నారు.
Also Read:బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2020:40 అసెంబ్లీ సీట్లలో జేడీ(యూ) ను దెబ్బతీసిన ఎల్‌జేపీ
తేజస్వి చాలా మంచి కుర్రాడని కూడా ఉమాభారతి ప్రశంసించారు. రాష్ట్రాన్ని నడపగలిగే సత్తా అతనికి ఇంకా రాలేదని, లాలూ తిరిగి బీహార్‌ను జంగిల్ రాజ్‌గా మారుస్తారని భావించడం వల్లే బీహార్ ప్రజలు అందుకు తగట్టుగా తీర్పునిచ్చారని ఆమె అభిప్రాయపడ్డారు. తేజస్వి నాయకత్వం వహించగలడు కానీ అతనికి మరింత వయస్సు రావాలని ఉమాభారతి విశ్లేషించారు.
బీహార్ శాసనసభ ఎన్నికల్లో 75 సీట్లు సాధించి రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిన ఆర్జేడీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం వెలువడిన బీహార్ శాసనసభ ఫలితాల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 125 స్థానాల్లో విజయం సాధించి సాధారణ మెజారిటీతో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది.
137 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోనే ఎల్‌జేపీ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. జేడీ (యూ) ఓట్లను భారీగా చీల్చేందుకే బీజేపీ వ్యూహాత్మకంగా చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్‌జేపీని ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయించిందని కొందరు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
