Asianet News TeluguAsianet News Telugu

నడ్డా జట్టులో రాజీవ్ చంద్రశేఖర్: పురంధేశ్వరి, డీకే అరుణలకు పెద్దపీట

బీజేపీ జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా. ఈ జాబితాలో మాజీ మంత్రి డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడిగా కె. లక్ష్మణ్‌, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని,  జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్‌, బీజేపీ జాతీయ యువమోర్చా అధ్యక్షుడిగా కర్ణాటక యువ ఎంపీ తేజస్వీ సూర్యను నియమించారు.

JP nadda replaces Ram Madhav, P Muralidhar Rao with new faces
Author
New Delhi, First Published Sep 26, 2020, 4:25 PM IST

బీజేపీ జాతీయ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా. ఈ జాబితాలో మాజీ మంత్రి డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడిగా కె. లక్ష్మణ్‌, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని,  జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్‌, బీజేపీ జాతీయ యువమోర్చా అధ్యక్షుడిగా కర్ణాటక యువ ఎంపీ తేజస్వీ సూర్యను నియమించారు.

అయితే ఈ జాతీయ కమిటీలో రాంమాధవ్, మురళీధర్‌రావులకు చోటు దక్కలేదు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికే నడ్డా తన జట్టులో స్థానం కల్పించారు. కొత్త కార్యవర్గంలో 12 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 8 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు, ముగ్గురు నేషనల్ జాయింట్ సెక్రటరీలు, 13 మంది జాతీయ కార్యదర్శులు, ట్రెజరర్, సంయుక్త ట్రెజరర్, పార్టీ కార్యాలయ కార్యదర్శి, ఐటీ, సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్, ఆరుగురు మోర్చా అధ్యక్షులు, 23 మంది జాతీయ అధికార ప్రతినిధులు ఉన్నారు. 

జాతీయ ఉపాధ్యక్షులు:

1. డాక్టర్ రమణ్ సింగ్, 
2. శ్రీమతి వసుంధరా రాజే సింధియా
3. రాధా మోహన్ సింగ్
4. జే పాండా
5. రఘుబర్‌దాస్
6. ముకుల్ రాయ్
7. రేఖా వర్మ
8. అన్నపూర్ణా దేవి
9. డాక్టర్ భారతి షియాల్
10. శ్రీమతి డీకే అరుణ
11. ఎం చుబా అయో
12. ఏపీ అబ్ధుల్లాకుట్టీ

జాతీయ ప్రధాన కార్యదర్శులు:

1. భూపేందర్ యాదవ్
2. అరుణ్ సింగ్
3. కైలాష్ విజయవర్గీయ
4. దుష్యంత్ కుమార్ గౌతమ్
5. దగ్గుబాటి పురంధేశ్వరి
6. సీటీ రవి
7. తరుణ్ చుగ్
8. దీలిప్ సైకియా


జాతీయ ప్రధాన కార్యదర్శి ( ఆర్గనైజేషన్)
1. బీఎల్ సంతోష్

జాతీయ కార్యదర్శులు

1. వినోద్ తవాడే
2. వినోద్ శంకర్
3. సత్యకుమార్
4. సునీల్ దేవ్‌ధర్
5. అరవింద్ మీనన్
6. హరీశ్ ద్వివేది
7. పంకజా ముండే
8. ఓం ప్రకాశ్ దూర్వే
9. అనుపమ్ హజ్రా
10. డాక్టర్ నరేంద్ర సింగ్
11. విజయ రహాట్కర్
12. అలికా గుర్జర్
13. బిశ్వేశ్వర్ టుడూ

ట్రెజరర్:

1. రాకేశ్ అగర్వాల్

జాయింట్ ట్రెజరర్:

1. సుధీర్ గుప్తా

జాతీయ కార్యాలయ కార్యదర్శి:

1. మహేంద్ర పాండే

ఐటీ అండ్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్:

1. అమిత్ మాలవీయ

యువ మోర్చా:

1. తేజస్వి సూర్య

ఓబీసీ మోర్చా:

1. డాక్టర్ కే లక్ష్మణ్

కిసాన్ మోర్చా:

1. రాజ్‌కుమార్ చాహర్

ఎస్సీ మోర్చా:

1. లాల్ సింగ్ ఆర్యా

ఎస్టీ మోర్చా:

1. సమీర్ ఓరా

మైనారిటీ మోర్చా:

1. జమాల్ సిద్ధిఖీ

జాతీయ అధికార ప్రతినిధులు:

1. అనిల్ బలౌనీ
2. సంజయ్ మయూఖ్
3. సంబిత్ పాత్రా
4. సుధాన్షు త్రివేది
5. సయ్యద్ షనవాజ్ హుస్సేన్
6. రాజీవ్ ప్రతాప్ రూడీ
7. నళిన్ ఎస్ కోహ్లీ
8. రాజీవ్ చంద్రశేఖర్
9. గౌరవ్ భాటియా
10. సయ్యద్ జాఫర్ ఇస్లామ్
11. టామ్ వడక్కన్
12. సంజూ వర్మ
13. గోపాల్ కృష్ణ అగర్వాల్
14. ఇక్బాల్ సింగ్ లాల్‌పురా
15. సర్దార్ ఆర్‌పీ సింగ్
16. రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్
17. అపరాజితా సారంగి
18. హీనా గావిట్
19. గురు ప్రకాశ్
20. ఎం.కికాన్
21. నుపూర్ శర్మ
22. రాజు బిష్ట్
23. కేకే శర్మ‌

మరోవైపు బీజేపీ నూతన కార్యవర్గంలో చోటు దక్కించుకున్న వారికి ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు తెలియజేశారు. భారతదేశ ప్రజలకు నిస్వార్థంగా , అంకిత భావంతో చేసే బీజేపీకి వీరంతా మద్ధతుగా నిలుస్తారని ప్రధాని ఆకాంక్షించారు. పేదలు, అట్టడుగున వున్న వారి శ్రేయస్సు కోసం వీరు కృషి చేస్తారని మోడీ అభిలషించారు.

పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సైతం నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. జనరల్ సెక్రటరీగా పనిచేయడానికి తనకు అవకాశం కల్పించిన పార్టీ అధినాయకత్వానికి మాధవ్ కృతజ్ఞతలు తెలియజేశారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios