Asianet News TeluguAsianet News Telugu

మేనల్లుడితో అక్రమ సంబంధం.... దుస్తులు చింపి, జుత్తు కత్తిరించి

 ఓ మహిళ భర్త మూడు నెలలుగా పని మీద నగరానికి వెళ్లాడు. భర్త లేని సమయంలో ఆమెకు సహాయం చేసేందుకు ఆమె మేనల్లుడు(22) అక్కడికి వచ్చాడు. అయితే.. భర్తలేడని ఆ  వివాహిత తన మేనల్లుడితోనే అక్రమ సంబంధం పెట్టుకుందని పంచాయితీ పెద్దలు అనుమానించారు.  

Jharkhand woman stripped, hair chopped off over suspicion of illicit relationship
Author
Hyderabad, First Published Aug 26, 2019, 11:09 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఓ వివాహితపై గ్రామస్థులు అనుమానపడ్డారు. ఆమెపై నీచమైన నిందలు వేయడంతోపాటు ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఇంట్లో నుంచి బయటకు లాగి.. దుస్తులు చింపేశారు. అనంతరం ఆమె జట్టు కూడా కత్తిరించారు. ఈ దారుణ సంఘటన  జార్ఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కొడెర్మా జిల్లా డెంగోడిహ్ గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త మూడు నెలలుగా పని మీద నగరానికి వెళ్లాడు. భర్త లేని సమయంలో ఆమెకు సహాయం చేసేందుకు ఆమె మేనల్లుడు(22) అక్కడికి వచ్చాడు. అయితే.. భర్తలేడని ఆ  వివాహిత తన మేనల్లుడితోనే అక్రమ సంబంధం పెట్టుకుందని పంచాయితీ పెద్దలు అనుమానించారు.  ఆ మహిళను పట్టుకొని  ఇంట్లో నుంచి బయటకు లాగారు. అనంతరం ఆమె ఒంటిపై దుస్తులు లాగేసి ఆమె జుట్టును కత్తిరించారు. 

కాగా తన మేనల్లుడు మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని.. ఆ కోపంతో తన మేనల్లుడే తనపై చెడుగా పంచాయితీ పెద్దలకు చెప్పడని ఆమె వాపోతోంది. కాగా..  ఈఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.   వివాహిత జుట్టును కత్తిరించిన ఘటనలో 11 మంది నిందితులను గుర్తించామని, దీనిపై కేసు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకుంటామని కొడెర్మా జిల్లా ఎస్పీ తమిళ్ వంజన్ చెప్పారు

Follow Us:
Download App:
  • android
  • ios