జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో గురువారం ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసకుంది. ఇందులో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. 

జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో గురువారం ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసకుంది. ఇందులో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిని పాకిస్తాన్ ఆధారిత లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి అనుబంధంగా ఉన్న ఉగ్రవాదులగా గుర్తించారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కుప్వారాలోని జుమాగుండ్ గ్రామంలో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నంపై నిర్దిష్ట సమాచారం అందడంతో తాము ఆపరేషన్ ప్రారంభించామని జమ్మూ కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. 

‘‘కుప్వారాలోని జుమాగుండ్ గ్రామంలో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నానికి సంబంధించి కుప్వారా పోలీస్‌కు అందిన నిర్దిష్ట ఇన్‌పుట్ ఆధారంగా.. చొరబడిన ఉగ్రవాదులను ఆర్మీ, పోలీస్ అడ్డుకోవడంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది’’ అని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. ‘‘ముగ్గురు ఉగ్రవాదులు తటస్థించబడ్డారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ LeTకి అనుబంధంగా ఉన్నారు. గుర్తింపు నిర్ధారణ జరుగుతోంది. ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో సహా నేరారోపణ పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి” అని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.

Scroll to load tweet…


ఇక, జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో బుధవారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. జిల్లాలోని క్రీరీ ప్రాంతంలోని నజీభట్ క్రాసింగ్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పాక్ ఉగ్రవాదులును భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ పోలీసు వీరమరణం పొందారు. ఈ ఆపరేషన్‌లో జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్త బృందం పాల్గొంటున్నట్లు కశ్మీర్ పోలీసులు తెలిపారు. ‘‘ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక జమ్మూ కాశ్మీర్ పోలీసు జవాను వీరమరణం పొందారు’’ కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇక, ఈ ఎన్‌కౌంటర్‌కు చెందిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.