Asianet News TeluguAsianet News Telugu

దోషం తొలగిపోవాలంటే.. లైంగిక వాంఛ తీర్చాల‌న్న‌ దొంగ స్వామి.. నోట్లో బ‌ట్ట‌లు కుక్కి రేప్.. వీడియో తీసి..

jalore rape case: రాజ‌స్తాన్ లోని జలోర్ జిల్లా సంచోర్ ప్రాంతంలోని దత్తాత్రేయ ఆశ్రమంలో దారుణం వెలుగులోకి వ‌చ్చింది. కాల దోషాలు తొలగిస్తామనే సాకుతో ఆ ఆశ్రమంలోని ఓ పూజ‌రి..  త‌న లైంగిక వాంఛ తీర్చాల‌ని వేధించారు. మాట విన‌క‌పోయే స‌రికి బ‌ల‌వంతంగా అత్యాచారం చేశారు. ఆ దారుణాన్ని వీడియో తీసి.. బ్లాక్ మెయిల్ చేశారని బాధితురాలు ఆరోపించింది.

 

jalore rape case Ashram, video and rape horror Rajasthan woman's shocking allegations
Author
Hyderabad, First Published Aug 2, 2022, 11:14 PM IST

Jalore Rape Case: రోజు రోజుకు శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న..  కొంతమంది మాత్రం ఇంకా మూఢనమ్మకాల నుండి బయటపడడం లేదు. ఈ నమ్మకాలను క్యాష్ చేసుకొని కొంతమంది దొంగబాబాలు, దొంగ స్వామిజీలు మ‌హిళాపై దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలోని దారుణం వెలుగులోకి వ‌చ్చింది. జలోర్ జిల్లా సంచోర్ ప్రాంతంలోని  భగవాన్ దత్తాత్రేయ ఆశ్రమంలో  జరిగిన అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. 

పోలీసులు అందించిన‌ సమాచారం ప్రకారం.. భగవాన్ దత్తాత్రేయ ఆశ్రమంలో పూజారి కృష్ణ ఓ అమాయ‌కురాలి జీవితాన్ని నాశ‌నం చేశారు. ఓ యువ‌తిపై క‌న్నేసిన ఆ పూజారి..  ఆమెకు కాల‌ దోషం ఉంద‌ని.. ఆ దోషాన్ని తొల‌గించుకోవాలంటే..త‌న‌తో అక్రమ సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేశాడు. మాట విన‌క‌పోయే సారికి లైంగికంగా వేధించాడు. మ‌య మాట‌లు చెప్పి.. త‌నపై లైంగిక దాడి చేశాడ‌నీ.. త‌న అరుపులు బ‌య‌ట‌కు వినిపించ‌కుండా.. నోట్లో కుక్కి అత్యాచారం చేశాడ‌ని బాధితురాలు ఆరోపించింది. 

పూజారి కృష్ణ త‌న లైంగిక వాంఛ తీర్చాల‌ని ఒత్తిడి చేయాల‌నీ, అలా చేస్తేనే దోషాన్ని తొలిగిపోతుంద‌ని చెప్పాడని బాధితుడు ఆరోపించాడు. ఒప్పుకోక‌పోతే.. ఆశ్రమానికి పిలిచి తనపై అత్యాచారం చేశాడని మహిళ ఆరోపించింది. ఆ పూజారి త‌న‌ను బంధించి.. 108 రోజుల్లో 21 సార్లు లైంగిక దాడి చేసి.. వేధించాడ‌ని తెలిపింది. ఆశ్రమ నిర్వాహకురాలు హేమలత కూడా ఈ లైంగిక దాడికి సహకరించిందని బాధితురాలు ఆరోపించింది.

సాధ్వీ హేమ‌ల‌త‌.. త‌నపై అత్యాచారం చేస్తున్న సమయంలో వీడియో తీసింద‌నీ,  ఈ దారుణాన్ని ఏదైనా చెబితే పరువు తీస్తానని, చంపేస్తానని బెదిరించారని ఆ యువ‌తి త‌న వేద‌నను చెప్పింది. ఈ మొత్తం సంఘటన 19 ఫిబ్రవరి 2022 నాడు జరిగింద‌నీ, ఈ ఘ‌ట‌న‌ జూలై 27న కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 19, 2022న.. పూజ‌రి , సాధ్వి హేమలత తనను మోసపూరితంగా ఆశ్రమానికి పిలిచి, తనపై అత్యాచారం చేశారని బాధితురాలు పేర్కొంది.
 
ఈ ఘ‌ట‌న‌పై సర్వనా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి కిష్ణరామ్ బిష్ణోయ్ మాట్లాడుతూ.. బాధితురాలు ఫిర్యాదును స్వీకరించి.. జూలై 27 న కేసు న‌మోదు చేయ‌బ‌డిన‌ట్టు తెలిపారు. ఈ వ్యవహారంపై పోస్ట్ ద్వారా ఫిర్యాదు అందిందని, ఇందులో జోధ్‌పూర్‌లోని  సేవా విశ్వ గురు దత్తాత్రేయ ఆశ్రమ పూజ‌రి త‌న‌పై  అత్యాచారం చేశాడని ఆరోపించారు. ఆశ్రమంలో సాధ్వి హేమలత తగరమ్‌తో అక్రమ సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేసింద‌ని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు.


బాధితురాలకు హత్య బెదిరింపులు 

అదే సమయంలో.. ఆశ్రమంలో త‌నపై విక్ష‌చ‌న ర‌హితంగా దాడి చేశార‌నీ, తన నోటిలో గుడ్డలు కుక్కి త‌న‌పై అత్యాచారం చేశార‌నీ... ఇదంతా సాధ్వి హేమలత తన వీడియోను కూడా తీశారని మహిళ ఆరోపించింది. ఈ దారుణాన్ని ఏదైనా చెబితే పరువు తీస్తానని, చంపేస్తానని బెదిరించారని ఆ మహిళ చెప్పింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us:
Download App:
  • android
  • ios