ISRO: భూమి పరిశీలన ఉపగ్రహం (Earth Observation Satellite) EOS-04 ను వాలంటైన్స్ డే (ఫిబ్రవరి 14)న లాంచ్ చేయాల‌ని ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (Isro) నిర్ణయించింది.  పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, PSLV-C52ను ఫిబ్రవరి 14న ఉదయం 05:59 గంటలకు శ్రీహరికోట, సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ లోని ఫస్ట్ లాంచ్ ప్యాడ్ వేదికగా లాంచ్ చేయనున్నారు ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు. 

25 గంటల కౌంట్ డౌన్... 

పీఎస్ఎల్వీ సిరీస్ లోని 1710 కిలో గ్రాముల ఈ ఉపగ్రహాన్ని 529 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సూర్య ధృవ కక్షలోకి ఇస్రో పంపనుంది. ఇందులో కొలరాడో విశ్వవిద్యాలయంలోని లాబొరేటరీ ఆఫ్ అట్మాస్ఫియరిక్ & స్పేస్ ఫిజిక్స్‌తో కలిసి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ & టెక్నాలజీ అభివృద్ధి చేసిన INSPIREsat-1 అనే ఉపగ్రహం, INS-2TD అనే ఉపగ్రహాల‌ను ప్ర‌యోగించ‌నున్నారు. INS-2TD అనేది భారతదేశం-భూటాన్ జాయింట్ శాటిలైట్. (INS-2B)కి పూర్వగామి. వీటితో పాటు PSLV మరో రెండు చిన్న ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది. 

EOS-04 అనే ఉప గ్రహాం.. వ్యవసాయం, అటవీ, నేలపై ఉండే తేమ, ఫ్లడ్ మ్యాపింగ్ వంటి అప్లికేషన్‌ల కోసం ఈ ఉప‌గ్ర‌హాన్ని ప్ర‌యోగించ‌నున్నారు. అలాగే వాతావరణ పరిస్థితుల్లో మార్పుల‌కు సంబంధించిన‌ చిత్రాలను మ‌రింత నాణ్య‌త‌తో అందించడానికి ఈ ఉపగ్రహం ప‌నిచేస్తుంది. ఈ ప్రయోగం కోసం 25 గంటల పాటు దీనికి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 14-17 మధ్య ఇస్రో తన వర్క్‌హార్స్ PSLV-C52 ఉపగ్రహాన్ని లో ఎర్త్ ఆర్బిట్ (LEO)కి పంపాలని యోచిస్తున్నట్లు ఇంత‌కు ముందు తెలిపింది.

కోవిడ్ -19 మహమ్మారి, వరుస లాక్‌డౌన్‌ల కారణంగా ఈ ప్ర‌యోగం ఆలస్యమైనదని ఇస్రో తెలిపింది. ఇప్పటికే గగన్‌యాన్, చంద్రయాన్ -3, ఆదిత్య ఎల్ 1 మిషన్‌ల వంటి అనేక మిషన్‌లను ఆల‌స్య‌మ‌య్యాయి. 2022లో 19 మిషన్లను ప్రయోగించనున్నట్లు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ఇటీవల తెలిపారు. ఇస్రో.. 08 లాంచ్ వెహికల్ మిషన్లు, 07 స్పేస్‌క్రాఫ్ట్ మిషన్లు, 04 టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్ మిషన్‌లను ప్ర‌యోగించనున్న‌ది.

ఈ ఏడాది ఆగస్టులో చంద్రయాన్-3 ప్రయోగానికి అంతరిక్ష సంస్థ కూడా సిద్ధమైంది. చంద్రయాన్-2 చంద్రునికి అవతలి వైపు క్రాష్-ల్యాండ్ అయిన రెండు సంవత్సరాల తర్వాత మూడవ చంద్ర మిషన్ వస్తుంది.